Goli soda: మనం మరిచిన గోలీ సోడా కొత్తగా వస్తోంది.. అమెరికా, యూరప్, గల్ఫ్లో కూడా హవా
గోలీ సోడా ఈ తరం వారికి ఈ పేరు పెద్దగా తెలియకపోయినప్పటికీ 80,90లో వారికి మాత్రం ఫేవరేట్ డ్రింక్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా గోలీ సోడాను తాగేవారు. సోడా బాటిల్లో ఉండే గోలీని నొక్కగానే 'టప్' అనే శబ్ధం రావడం, రుచి కూడా బాగుండడంతో చాలా మంది ఇష్టంగా తాగేవారు..