Post office: మీరు ఏం చేయకపోయినా రూ. 2 లక్షలు మీ సొంతం.. ఈ పథకం గురించి తెలుసా.?
Post office: స్టాక్ మార్కెట్ లేదా SIPల జోరు ఉన్నప్పటికీ, పోస్టాఫీసులోని కొన్ని పథకాలు అంతే ప్రాచుర్యం పొందాయి. ఆ జాబితాలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కూడా ఉంది. ఈ పథకంలో డబ్బు పెడితే కేవలం వడ్డీతోనే 2 లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

లాభాల కోసం పెట్టుబడి
భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చాలామంది చాలా పనులు చేస్తారు. కొందరు మంచి లాభాల కోసం పెట్టుబడి పెడితే, కొందరు బ్యాంకులో డబ్బు దాచుకుంటారు. కానీ ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందో అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.
అసలేంటీ NSC.?
పెట్టుబడి నియమాలను పాటిస్తే, పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు పెట్టుబడిదారులకు రిస్క్ లేకుండా మంచి రాబడిని అందిస్తాయి. మీరు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టి, ఎక్కువ రాబడి పొందాలనుకుంటే, NSC లాంటి పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక.
వడ్డీ ద్వారా ఆదాయం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (పోస్టాఫీసు NSC) అనేది కేవలం వడ్డీ ద్వారా మంచి ఆదాయం సంపాదించడానికి సహాయపడే ఒక పథకం. మీరు ఈ పథకంలో కేవలం 1,000 రూపాయలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ పథకం లాక్-ఇన్ వ్యవధి 5 సంవత్సరాలు.
రిటైర్మెంట్ ప్లాన్ కోసం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాల కింద ఉన్న ఒక సూపర్ హిట్ స్కీమ్. ఇది మధ్యతరగతి, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేవారిలో ప్రాచుర్యం పొందింది. 5 ఏళ్లకు కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు.
జీరో రిస్క్
పోస్టాఫీసు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పెట్టుబడి పూర్తిగా రిస్క్ లేనిది. ఇక్కడ డబ్బుకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది. కేవలం రూ.1000తో పెట్టుబడి మొదలుపెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.7% వార్షిక వడ్డీ లభిస్తోంది.
చక్రవడ్డీతో అధిక లాభాలు
ఈ పోస్టాఫీసు ప్రభుత్వ పథకంలో వడ్డీని చక్రవడ్డీ పద్ధతిలో ఇస్తారు. మెచ్యూరిటీ తర్వాత, అసలు, వడ్డీ కస్టమర్ సేవింగ్స్ ఖాతాకు పంపిస్తారు. ఈ పథకం నుంచి అధిక వడ్డీ పొందాలంటే, 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. ఇదే ఈ పథకం లాకిన్ పీరియడ్. 5 ఏళ్లలోపు డబ్బు తీస్తే వడ్డీ నష్టపోతారు. మీరు ఈ పథకంలో రూ. 500000 పెట్టుబడి పెడితే ఐదేళ్లకు సుమారు రూ. 200000కిపైగా వడ్డీ పొందుతారు.

