MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఈజీ అన్నావ్‌గా..! ఇప్పుడేంటి మరి.. మంజ్రేకర్‌కు కోహ్లీ సెటైర్..

ఈజీ అన్నావ్‌గా..! ఇప్పుడేంటి మరి.. మంజ్రేకర్‌కు కోహ్లీ సెటైర్..

Virat Kohli: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో, సంజయ్ మంజ్రేకర్ పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడన్న మంజ్రేకర్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. 

2 Min read
Author : Pavithra D
Published : Jan 22 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంజయ్ మంజ్రేకర్‌పై విమర్శలు..
Image Credit : Virat Kohli\BCCI

సంజయ్ మంజ్రేకర్‌పై విమర్శలు..

టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఓటమిపాలైన నేపథ్యంలో వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్ట్ పెట్టారు.

25
సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో..
Image Credit : AFP

సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో..

గతంలో సంజయ్ మంజ్రేకర్ ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ ఈజీ ఫార్మాట్‌ను ఎంచుకున్నాడని విమర్శించారు. తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్ట్‌లకు వీడ్కోలు పలికాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌లో రాణిస్తుంటే, కోహ్లీ మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం నిరాశపరిచిందని ఆయన తక్కువ చేసి మాట్లాడారు.

Related Articles

Related image1
Virat Kohli : ఇన్‌స్టాగ్రామ్ నుండే కోహ్లీకి ఇంత సంపాదనా..! ఒక్క పోస్ట్‌కు ఎంత తీసుకుంటాడో తెలుసా..?
Related image2
Virat Kohli : ధోనీనా? రోహితా? కోహ్లీకి కలిసొచ్చిన కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !
35
అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించినా..
Image Credit : Getty

అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించినా..

విరాట్ అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించినా బాగుండేదని, కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్‌కు సులువైన వన్డేలలో కొనసాగడం మరింత నిరాశకు గురి చేసిందని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వికాస్ కోహ్లీ కూడా సంజయ్ మంజ్రేకర్ పేరు ప్రస్తావించకుండా, "కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదు అన్నట్లుగా ఉంది పరిస్థితి" అని థ్రెడ్స్‌లో ఘాటుగా బదులిచ్చారు.

45
మరోసారి సంజయ్ మంజ్రేకర్‌పై సెటైర్లు
Image Credit : AFP

మరోసారి సంజయ్ మంజ్రేకర్‌పై సెటైర్లు

తాజాగా, వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోవడంతో వికాస్ కోహ్లీ మరోసారి సంజయ్ మంజ్రేకర్‌పై సెటైర్లు పేల్చారు. స్టూడియోలో కూర్చుని ఏదైనా మాట్లాడటం సులువని, మైదానంలోకి దిగితేనే అసలు విషయం తెలుస్తుందని చురకలు అంటించారు. "మిస్టర్ క్రికెట్ ఎక్స్‌పర్ట్, నీ దగ్గర అత్యంత సులువైన ఫార్మాట్ గురించి ఏవైనా సూచనలు ఉన్నాయా? అయినా అవి పనిచేయాలంటే మీరు మైదానంలో ఉండాలి కదా?" అని వికాస్ కోహ్లీ ప్రశ్నించారు.

55
చెప్పడం సులభం, కానీ చేయడమే కష్టం
Image Credit : AFP

చెప్పడం సులభం, కానీ చేయడమే కష్టం

"ఏదేమైనా చెప్పడం సులభం, కానీ చేయడమే కష్టం" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. వికాస్ కోహ్లీ పెట్టిన ఈ పోస్ట్‌పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంజ్రేకర్‌కు సరైన జవాబు చెప్పాడని విరాట్ అభిమానులు వికాస్‌ను పొగుడుతున్నారు. ఈ పరిణామం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్
Recommended image2
T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?
Recommended image3
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Related Stories
Recommended image1
Virat Kohli : ఇన్‌స్టాగ్రామ్ నుండే కోహ్లీకి ఇంత సంపాదనా..! ఒక్క పోస్ట్‌కు ఎంత తీసుకుంటాడో తెలుసా..?
Recommended image2
Virat Kohli : ధోనీనా? రోహితా? కోహ్లీకి కలిసొచ్చిన కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved