Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే
Vegetables Price in Telugu States : వీకెండ్ వచ్చిందంటే చాలు చిన్నచిన్న గల్లీల్లో కూడా కూరగాయల మార్కెట్స్ వెలుస్తాయి… చాలామంది ఇక్కడే కొంటుంటారు. ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు...
Vegetables Price in Hyderabad : ప్రస్తుతం కూరగాయల ధరలు తక్కువగానే ఉన్నాయి... దీంతో సామాన్యులపై కాస్త భారం తగ్గింది. ప్రతి వీకెండ్ హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లోనే కాదు ఇతర పట్టణాలు, గ్రామాల్లోనూ కూరగాయల మార్కెట్స్ జరుగుతుంటాయి. ఈ క్రమంలో మీరు కూడా ఈ వారాంతం కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ఓసారి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొండి.
టమాటా ధర ఎంత..?
ఇటీవల టమాటా ధర కిలో 50-60 రూపాయలు పలికింది. దీంతో ఎక్కడ మళ్లీ టమాటా సామాన్యులకు అందుబాటులో ఉండకుండా పోతుందోనని అందరూ కంగారుపడిపోయారు. కానీ అమాంతం టమాటా ధర పడిపోయింది... ప్రస్తుతం కిలో టమాటా కేవలం రూ.10-20 కే లభిస్తోంది.
ఉల్లిపాయల ధర..
చాలారోజులుగా ఉల్లిపాయల ధర స్థిరంగా ఉంది. కిలో ఉల్లిపాయలు రూ.20-25 కే లభిస్తున్నాయి... ఎక్కువగా కొంటే రూ.100 కే ఐదారు కిలోలు కూడా వస్తున్నాయి. రైతుల వద్ద కొంటే మరింత తక్కువధరకు ఉల్లిపాయలు లభిస్తాయి.. ఇవి ఎక్కువకాలం నిల్వ ఉంటాయి కాబట్టి ఒకేసారి ఎక్కువగా కొనవచ్చు.
ఇతర కూరగాయల ధరలు
చిక్కుడు కిలో రూ 20-25
పచ్చిమిర్చి కిలో రూ.45-50
బీట్ రూట్ కిలో రూ.15-20
ఆలుగడ్డ కిలో రూ.15-20
క్యాప్సికం కిలో రూ.40-45
కాకరకాయ కిలో రూ.40-45
సొరకాయ కిలో రూ.20-30
బీన్స్ కిలో రూ.45-50
క్యాబేజీ కిలో రూ.15-20
క్యారెట్ కిలో రూ.20-30
వంకాయలు కిలో రూ.20-30
బెండకాయలు కిలో రూ.35-40
బీరకాయ కిలో రూ. 35-40
దొండకాయ కిలో రూ.40-50
ఆకుకూరల ధరలు
పాలకూర కిలో రూ.30-40 (కొంచెం పెద్దసైజు కట్ట ఒక్కటి రూ.20)
పూదీనా రూ.10-15 కట్ట
కరివేపాకు రూ.10 కట్ట (కిలో రూ.120)
కొత్తిమీర రూ.20 కట్ట, చిన్న కట్ట రూ.10
మెంతి కూర కిలో రూ.20
చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

