MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • డెడ్ లైన్ దగ్గర పడుతోంది..! తేల్చుకోండి అని అల్టిమేటం ఇచ్చిన బీసీసీఐ

డెడ్ లైన్ దగ్గర పడుతోంది..! తేల్చుకోండి అని అల్టిమేటం ఇచ్చిన బీసీసీఐ

BCCI: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు సొంత మైదానాల సమస్యను ఎదుర్కొంటున్నాయి. జనవరి 27లోగా తమ మైదానాలు ఖరారు చేయాలని బీసీసీఐ గడువు విధించింది. లేదంటే ప్రత్యామ్నాయ నగరాలను కేటాయించే అవకాశం ఉంది. 

1 Min read
Author : Pavithra D
Published : Jan 22 2026, 09:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీసీసీఐ గడువు విధించింది..
Image Credit : IPL\Twitter

బీసీసీఐ గడువు విధించింది..

ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న వేళ, రెండు కీలక ఫ్రాంచైజీలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తమ సొంత మైదానాల విషయంలో తీవ్ర ఇబ్బందిలో పడ్డాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 27 వరకు గడువు విధించింది.

25
ఆర్సీబీకి బెంగళూరులోని..
Image Credit : IPL Twitter

ఆర్సీబీకి బెంగళూరులోని..

ఆర్సీబీకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ కాగా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలు వారికి తలనొప్పిగా మారాయి. స్టేడియం వెలుపల రోడ్ల నిర్వహణ, అగ్నిమాపక దళం వంటి ప్రభుత్వ బాధ్యతలను ఫ్రాంచైజీయే చూసుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది. డీజే నిర్వహణకు అనుమతి నిరాకరించడం కూడా ఆర్సీబీ యాజమాన్యానికి నచ్చడం లేదు. ఈ సమస్యలపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. చర్చలు విఫలమైతే ఆర్సీబీ తమ మైదానాన్ని మార్చుకునే అవకాశం ఉంది.

Related Articles

Related image1
RCB : బెంగళూరులో నో IPL మ్యాచ్‌.. ఆర్సీబీ కొత్త అడ్డా ఫిక్స్ ! కోహ్లీ అభిమానులకు షాక్
Related image2
IPL 2026 : ఐపీఎల్‌లోకి ఏఐ ఎంట్రీ.. అంబానీ, ఆదానీ కాదు, ఈసారి గూగుల్ జెమినీ !
35
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు
Image Credit : X/IPL

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు

మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం సొంత మైదానం. అయితే, ఇక్కడ సమస్య ప్రభుత్వంతో కాదు, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ)లో నెలకొన్న పాలనాపరమైన గందరగోళం. చాలా కాలంగా ఎన్నికలు జరగకపోవడంతో జైపూర్ లో మ్యాచ్ లు నిర్వహించడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది.

45
ఐపీఎల్ షెడ్యూల్ ఖరారుకు..
Image Credit : IPL Twitter

ఐపీఎల్ షెడ్యూల్ ఖరారుకు..

పరిస్థితులు మెరుగుపడకపోతే ఆర్ఆర్ జట్టు జోధ్ పూర్ లేదా ఇతర నగరాలకు తరలించవచ్చు. ఐపీఎల్ షెడ్యూల్ ఖరారుకు మైదానాలపై స్పష్టత అవసరం కావడంతో, నిర్ణీత గడువులోగా మైదానాలు ఖరారు కాకపోతే బీసీసీఐ ప్రత్యామ్నాయ నగరాలను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

55
బీసీసీఐ కఠిన నిర్ణయం
Image Credit : IPL Twitter

బీసీసీఐ కఠిన నిర్ణయం

ఇది ఐపీఎల్ సజావుగా సాగడానికి బీసీసీఐ తీసుకుంటున్న కఠిన నిర్ణయం కానుందని చెప్పొచ్చు. ఫ్రాంచైజీలు, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు, ప్రభుత్వాలు కలిసి పని చేసి ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి ఈ ఫ్రాంచైజీలు తమ హోం గ్రౌండ్లు ఎప్పటిలోగా తేల్చుకుంటాయో వేచి చూడాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
SA vs NZ : టిమ్ సీఫెర్ట్ మాస్ బ్యాటింగ్.. ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన కివీస్ కుర్రాడు
Recommended image2
Bumrah : ఒక్క వికెట్ పడితే.. బుమ్రా సంచలనం !
Recommended image3
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్
Related Stories
Recommended image1
RCB : బెంగళూరులో నో IPL మ్యాచ్‌.. ఆర్సీబీ కొత్త అడ్డా ఫిక్స్ ! కోహ్లీ అభిమానులకు షాక్
Recommended image2
IPL 2026 : ఐపీఎల్‌లోకి ఏఐ ఎంట్రీ.. అంబానీ, ఆదానీ కాదు, ఈసారి గూగుల్ జెమినీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved