Smart TV: గూగుల్ టీవీ, ఫైర్ టీవీకి మధ్య తేడా ఏంటి.? రెండింటిలో ఏది బెస్ట్
Smart TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారిలో వచ్చే ప్రధాన సందేహం గూగుల్ టీవీని కొనాలా, ఫైర్ టీవీని కొనుగోలు చేయాలా.? ఇంతకీ చూడ్డానికి ఒకేలా కనిపించే ఈ రెండు టీవీల మధ్య తేడా ఏంటి.? రెండింటిలో ఏది మంచిది లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్, ఫైర్ టీవీలు అంటే ఏంటి.?
Google TV అనేది Google రూపొందించిన స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫామ్. ఇది Android TV ఆధారంగా పనిచేస్తుంది. YouTube, Google Photos, Google Assistant, Chromecast వంటి Google సేవలు ఇందులో బాగా కలిసిపోయి ఉంటాయి. వేర్వేరు OTT యాప్స్ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఒకే చోట చూపించే ప్రత్యేకత Google TVకి ఉంది. కొత్తగా Gemini AI సహాయంతో కంటెంట్ సూచనలు మరింత తెలివిగా మారాయి.
Fire TV అనేది Amazon రూపొందించిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. ఇది Fire OSపై పనిచేస్తుంది. Prime Video, Alexa, Amazon Music, Audible వంటి Amazon సేవలు ఇందులో ముందువరుసలో కనిపిస్తాయి. Alexa వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీతో పాటు ఇంట్లో ఉన్న స్మార్ట్ పరికరాలను కూడా నియంత్రించే అవకాశం Fire TVలో బలంగా ఉంటుంది.
హార్డ్‌వేర్ సామర్థ్యం, కనెక్టివిటీ తేడాలు
* Google TV Streamer 4K
Quad-core ప్రాసెసర్
4GB RAM
32GB స్టోరేజ్
HDMI 2.1, Wi-Fi 6, Bluetooth 5.1
Thread, Matter సపోర్ట్
* Fire TV Cube
Hexa-core ప్రాసెసర్
2GB RAM
16GB స్టోరేజ్
HDMI 2.1 ఇన్‌పుట్, అవుట్‌పుట్
Wi-Fi 6E
Far-field మైక్రోఫోన్లు
Fire TV Cube చేతులు ఉపయోగించకుండా వాయిస్ ద్వారా పనిచేస్తుంది. Google TV Streamer భవిష్యత్ స్మార్ట్ హోమ్ టెక్నాలజీకి రెడీగా ఉంటుంది. స్ట్రీమింగ్ స్టిక్స్ తక్కువ ధరలో లభిస్తాయి కానీ పోర్ట్స్ పరంగా పరిమితంగా ఉంటాయి.
సాఫ్ట్‌వేర్, ఇంటర్‌ఫేస్ అనుభవం
Google TV ఇంటర్‌ఫేస్:
* అన్ని యాప్స్ నుంచి కంటెంట్ ఒకే స్క్రీన్‌లో సూచనలు.
* యూజర్ ప్రొఫైల్ ఆధారంగా వ్యక్తిగత రికమండేషన్లు
* యాప్స్ రీ-అరేంజ్ చేసుకునే స్వేచ్ఛ
* ప్రకటనలు తక్కువగా కనిపిస్తాయి
Fire TV ఇంటర్‌ఫేస్:
* Prime Video కంటెంట్ ఎక్కువ ప్రాధాన్యం
* పెద్ద బ్యానర్ యాడ్స్
* Alexa ఆధారిత వాయిస్ సెర్చ్
* కస్టమైజేషన్ పరిమితంగా ఉంటుంది
* రోజువారీ వాడకంలో Google TV క్లిన్ ఫీల్ ఇస్తుంది. Fire TVలో ప్రకటనల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వీడియో, ఆడియో క్వాలిటీ సపోర్ట్
Google TVలో 4K @ 60fps, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+, డాల్బీ ఆట్మోస్ ఆడియో, క్రోమ్‌కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంటాయి. ఇక ఫైర్ టీవీ విషయానికొస్తే ఇందులో.. 4K @ 60fps, HDR10, HDR10+, HLG, Dolby Vision సపోర్ట్ లేదు, Dolby Atmos ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. Netflix, Disney+ వంటి యాప్స్ Dolby Vision కంటెంట్ ఎక్కువగా ఇస్తాయి. ఆ కోణంలో Google TV వీడియో క్వాలిటీకి మెరుగైన ఎంపికగా నిలుస్తుంది. ఆడియో పరంగా రెండూ సమాన స్థాయిలో ఉన్నాయి.
ఎవరికి ఏది బెటర్.?
Android ఫోన్ వాడేవారు, YouTube, YouTube TV ఎక్కువగా చూసేవారు, Google Photos, Nest డివైజ్‌లు ఉన్నవారు, క్లిన్ ఇంటర్‌ఫేస్ కావాలనుకునేవారు, Dolby Vision వీడియో క్వాలిటీ ముఖ్యం అనుకునేవారికి గూగుల్ టీవీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్స్, Alexa ఆధారిత స్మార్ట్ హోమ్ ఉన్నవారు, తక్కువ ధరలో మంచి డీల్ కావాలనుకునేవారు, యాప్స్ సైడ్‌లోడ్ చేయాలనుకునే యూజర్లకు ఫైర్ టీవీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

