
YS Jagan Mohan Reddy Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0 రప్పా రప్పా
నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో మళ్లీ సమావేశాలు ప్రారంభిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఏలూరు నియోజకవర్గంతో ఈ కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నామని, ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని కార్యకర్తలతో సమావేశం అవుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రెండు బడ్జెట్లు, మూడు సంవత్సరాల పాలన మాత్రమే మిగిలి ఉందని, అందులో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు.