- Home
- Automobile
- Bikes
- Hero HF Deluxe: రూ. 70 వేలలో 70 కిలోమీటర్ల మైలేజ్.. డెలివరీ బాయ్స్ ఈ బైక్ కొంటే పండగే
Hero HF Deluxe: రూ. 70 వేలలో 70 కిలోమీటర్ల మైలేజ్.. డెలివరీ బాయ్స్ ఈ బైక్ కొంటే పండగే
Hero HF Deluxe: డెలివరీ సర్వీస్‌ల విస్తృతి పెరిగింది. బైక్ ఉంటే చాలు ఉపాధి లభించే రోజులు వచ్చేశాయ్. అయితే మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ఓ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Hero HF Deluxeకి మంచి ఆదరణ
Hero HF Deluxe భారత మార్కెట్‌లో అత్యంత విశ్వసనీయమైన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. రోజూ ఆఫీస్‌కు వెళ్లే వారు, చిన్న వ్యాపారాలు చేసేవారు, డెలివరీ బాయ్స్ ఈ బైక్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కారణం మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు. ఈ బైక్ డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. ఫ్యామిలీ వినియోగానికి పూర్తిగా సరిపోతుంది. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బైక్ బాగా ఉపయోగపడుతుంది. రోడ్లు ఎలా ఉన్నా స్మూత్‌గా నడిచే సామర్థ్యం ఉంది. ధర కూడా అందుబాటులో ఉండటంతో మొదటిసారి బైక్ కొనుగోలు చేసే వారికి ఇది మంచి ఎంపికగా మారింది. Hero బ్రాండ్ మీద ఉన్న నమ్మకం కూడా ఈ బైక్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
ఇంజిన్ పవర్, మైలేజ్ వివరాలు
Hero HF Deluxe లో 97.2 సీసీ సామర్థ్యం కలిగిన ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ దీర్ఘకాలం పని చేసేలా రూపొందించారు. డైలీ యూజ్‌కు సరిపోయే పవర్ ఇస్తుంది. ఈ బైక్ గరిష్ఠంగా 8.02 PS పవర్ ఇస్తుంది. టార్క్ 8.05 Nm వరకు ఉంటుంది. నగర ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి ఇది సరిపోతుంది. మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ చెప్పే ప్రకారం లీటర్ పెట్రోల్‌కు సుమారు 70 కిలోమీటర్లు వస్తుంది. ఇది ఈ సెగ్మెంట్‌లో చాలా మంచి మైలేజ్‌గా చెప్పవచ్చు. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
Hero HF Deluxe అవసరమైన ఫీచర్లకే ప్రాధాన్యం ఇస్తుంది. హై వేరియంట్లలో i3S టెక్నాలజీ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగితే ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. క్లచ్ నొక్కగానే మళ్లీ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల పెట్రోల్ సేవ్ అవుతుంది. సేఫ్టీ పరంగా సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజిన్ స్టార్ట్ కాకుండా చేసే సెన్సార్ ఉంది. బైక్ పడిపోయినప్పుడు ఇంజిన్ ఆఫ్ అయ్యే సదుపాయం కూడా కల్పించారు. సాధారణ వేరియంట్లలో అనలాగ్ మీటర్ ఉంటుంది. టాప్ వేరియంట్ అయిన HF Deluxe Pro లో డిజిటల్ LCD డిస్‌ప్లే, LED హెడ్‌లైట్ లభిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
కంఫర్ట్, రైడింగ్ అనుభవం
ఈ బైక్ సీటు పొడవుగా ఉంటుంది. ఇద్దరు కూర్చోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైడింగ్ పొజిషన్ సూటిగా ఉండటంతో వెన్నునొప్పి వచ్చే అవకాశం తక్కువ. బైక్ బరువు సుమారు 110 నుంచి 112 కిలోల మధ్య ఉంటుంది. అందువల్ల కొత్తగా బైక్ నేర్చుకునేవారు కూడా సులభంగా నడపగలరు. ట్రాఫిక్‌లో తిప్పడం కూడా ఈజీగా ఉంటుంది. సస్పెన్షన్ సెటప్ సాధారణ రోడ్లకు సరిపోతుంది. చిన్న గుంతలు, స్పీడ్ బ్రేకర్ల దగ్గర పెద్దగా షాక్ అనిపించదు. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మంచి అనుభవాన్ని ఇస్తుంది.
ఆన్‌రోడ్ ధరల వివరాలు
నగరాల ఆధారంగా ఆన్‌రైడ్ ధరలు మారుతాయి. ఆర్‌టీఓ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఖర్చు కారణంగా ధరల్లో తేడా ఉంటుంది.
* HF Deluxe Kick Cast OBD2B: రూ.71,600 నుంచి రూ.76,600 వరకు
* HF Deluxe Self Cast OBD2B: రూ.75,300 నుంచి రూ.80,400 వరకు
* HF Deluxe I3S Cast OBD2B: రూ.76,900 నుంచి రూ.82,000 వరకు
* HF Deluxe Pro (టాప్ వేరియంట్): సుమారు రూ.85,800 వరకు
తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, నమ్మకమైన బైక్ కావాలనుకునే వారికి Hero HF Deluxe సరైన ఎంపికగా చెప్పవచ్చు.

