చిరంజీవి తో బోయపాటి శ్రీను ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? చిరంజీవి ఆఫర్ ఇచ్చినా.. బోయపాటి ఎందుకు సినిమా చేయలేదు.

చిరంజీవితో సినిమా అంటే డ్రీమ్..
చాలామంది డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే.. ఒక కల. తమ లైఫ్ లో ఒక్క సారి అయినా మెగా మూవీ చేయాలని కలలు కంటుంటారు. అది నెరవేరి.. ఆసినిమా హిట్ అయితే.. ఎగిరి గంతులేస్తారు. ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి, బాబీ లాంటి మెగా అభిమానుల్లో తమ కలలను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం టాప్ లో ఉన్న దర్శకులు చాలామంది మెగాస్టార్ తో సినిమా చేసినవారే. అయితే మాస్ సినిమాల దర్శకుడ బోయపాటి శ్రీను మాత్రం చిరంజీవితో సినిమా చేయలేకపోయాడు. మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చినా.. బోయపాటి ఎందుకు సినిమా చేయలేదు. కారణం ఏంటి?
రీ ఎంట్రీలో దుమ్మురేపుతోన్న చిరంజీవి..
70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి దుమ్మురేపుతున్నారు. ఈ ఏజ్ లో కూడా అదే గ్రేస్, అదే స్టైల్ ను మెయింటేన్ చేస్తున్నాడు చిరంజీవి. టాలీవుడ్ లో మెగాస్టార్ మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లోనే పాలిటిక్స్ లోకి వెళ్లారు. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. రీ ఎంట్రీ తరువాత మళ్లీ రుమ్మురేపుతున్నాడు.
అయితే మెగా స్టార్ రీ ఎంట్రీ అంత సులభంగా జరగలేదు. ఎలాంటి కథ తీసుకోవాలి, దర్శకుడు ఎవరు, ఏ బ్యానర్ లో చేయాలి.. ఇలా అనేక ఆలోచనలతో.. ఎన్నో చర్చలు జరిగాయి. ఎంతో మంది దర్శకులను లిస్ట్ చేసుకున్నారట మెగాస్టార్. ఈక్రమంలో చిరంజీవి రీ ఎంట్రీకోసం అనకున్న దర్శకులలో బోయపాటి కూడా ఉన్నట్టు సమాచారం.
బోయపాటికి చిరంజీవి ఆఫర్..
చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు ఏ దర్శకుడు అయితే సరైన ఎంపిక అవుతాడన్న అంశంపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. ఆ సమయంలో ఫామ్‌లో ఉన్న పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఈ రేసులో వి.వి. వినాయక్, బోయపాటి శ్రీను పేర్లు ఎక్కువగా వినిపించాయి.
అప్పటికే బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణతో కలిసి ‘సింహా’ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ సమయంలో బాలకృష్ణ వరుస ఫ్లాపులతో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, ‘సింహా’ సినిమా ఆయన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. మాస్ సినిమాలకు ఆదరణ తగ్గుతున్న టైమ్ లో బోయపాటి సాహసం అతనికి మంచి పేరును తీసుకువచ్చింది.
బాలయ్య సినిమా చూసి ఇప్రెస్ అయిన మెగాస్టార్
‘సింహా’ సినిమా చూసిన తర్వాత చిరంజీవి ఇంప్రెస్ అయ్యి... రీ ఎంట్రీ సినిమాను బోయపాటితో చేయాలని అనుకున్నాడట. స్వయంగా ఇంటికి పిలిపించి అభినంది.. తన రీ ఎంట్రీ సినిమాకు సరైన కథ ఉంటే చెప్పాలని బోయపాటిని అడిగారట... కానీ మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు తగ్గ కథ తన దగ్గరక లేకపోవడం.. బోయపాటి టైమ్ కావాలని అడగడంతో.. ఆ ఛాన్స్ మిస్ అయ్యి వినాయక్ చేతికి వెళ్లింది.
ఆతరువాత కూడా మెగాస్టార్ కోసం మంచి కథ రాయాలని బోయపాటి అనుకుని.. చేయలేకపోయారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించడానికి రెడీగా ఉన్నా.. బోయపాటి కథ రెడీ చేయలేకపోయారని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతోంది.
రామ్ చరణ్ తో డిజాస్టర్ మూవీ చేసిన బోయపాటి.
చిరంజీవి ఇమేజ్‌కు తగ్గ కథ తన వద్ద అప్పట్లో లేదని, అలాంటి కథ కుదిరినప్పుడు తప్పకుండా చిరంజీవిని కలిసి చెబుతానని బోయపాటి ఓ సందర్భంలో వెల్లడించినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో సినిమా చేయలేకపోయినా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బోయాపటి ఓ సినిమాచేశాడు. వినయవిధేయ రామ అనే ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్ యాక్షన్ మూవీని తెరకెక్కించాడు. కానీ ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ రామ్ చరణ్ ను చాలా కొత్తగా ఈ సినిమాలో చూపించాడు బోయపాటి.

