Artificial intelligence: ఆ కంపెనీలు.. తమ శరీరాన్ని తామే తినే పురుగుల్లాంటివి
Artificial intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడీ పదం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీ అనివార్యంగా మారింది. అయితే భవిష్యత్తులో దీంతో ఊహకందని మార్పులు రావడం ఖాయం.

ఆ పురుగులాంటిదే ఏఐ..
అదొక పురుగు, తన శరీరమే దాని ఆహారం. తన నోటితో తోక భాగం నుంచి శరీరాన్ని తింటుంది. అది పెరగాలంటే తన శరీరాన్ని తినాలి. ఒక పక్క శరీరాన్ని తానే తింటుంటే... ఎదుగుదల ఎట్లా ? ఈ ఊహాజనిత పురుగు లాంటిదే... నేటి కృతిమ మేథ ఇండస్ట్రీ. ఏఐ ఇండస్ట్రీ వృద్ధి చెందాలంటే పెట్టుబడులు కావాలి. పెట్టుబడి పెట్టేవాడు ... రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ... లాభాలు ఆశిస్తాడు. ప్రారంభ దశలో కృతిమ మేథ... వర్కర్లను తొలగించి ఖర్చులను తగ్గిస్తుంది .. కానీ ఉద్యోగాలు పోతుంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది.
ప్రమాదంలో ఉద్యోగాలు
మాదాపూర్ ప్రాంతాన్ని ఉదాహరణగా తీసుకుందాము. ఇరవై ఐదేళ్లల్లో వందలాది సాఫ్ట్‌వేర్ ఆఫీస్ లు.... వేలాది మంది ఉద్యోగులు. వీరికి మంచి జీతాలు, హోటళ్లు , మాల్స్.. ఎప్పుడూ కళకళలాడుతున్నాయి. ఇప్పుడు ఏఐ పుణ్యమా అంటూ ఉద్యోగాలు ఊడిపోతే .. అద్దె ఇళ్లకు డిమాండ్ పడిపోతుంది. కొత్త ఇళ్ల నిర్మాణం జరగదు . కార్లు , మొబైల్స్ షూస్ లాంటి వినియోగ వస్తువులను కొనేవారుండరు. ఏఐని పెట్టి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తారు సరే మరి కొనేవారెవ్వరు? కొనడానికి ప్రజల దగ్గర డబ్బు లేకపోతే... అమ్మకాలు పడిపోయి ఉత్పత్తి .. సర్వీస్ రంగాల బిజినెస్ పడిపోతుంది కదా ? అంటే ... కృతిమ మేథ పరిశ్రమలు తమ బాడీ తామే తినేసే పురుగు లాంటివి అన్నమాట.
భారీగా పెట్టుబడులు
ఇప్పటికే ఏఐ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే భవిషత్తు... అని భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ రిటర్న్ ఆన్ వస్ట్మెంట్... అంటే పెట్టిన డబ్బుపై రాబడి పెద్దగా లేదు . పోనీ ప్రభుత్వాలు పెడతాయా?... అంటే అవి దివాళా చక్రవర్తులు. జిడిపి అంటే ఒక దేశం సంవత్సర సంపాదన. మీ సంవత్సర జీతం కంటే మీ అప్పు ఎక్కువ అయ్యితే మీరు అప్పుల ఊబిలో చిక్కినట్టే. జపాన్ అప్పు దాని రెండున్నర సంవత్సరాల ఆదాయం ( జిడిపి లో 238 %), అమెరికా అప్పు 124 % , ఇంగ్లాండ్ 104 % ఇలాంటి ప్రభుత్వాలు పెద్దగా లాభాలు రాని ఏఐపై ఎంత మేర పెట్టుబడి పెట్టగలవు ? అంటే కృతిమ మేథ అయిపోయినట్టేనా ? బాల్య దశలోనే మరణమా ? కాదు, కృతిమ మేథ వాస్తవం అదే భవిత. కాకపోతే ఇప్పుడున్నటు కాక... అంటే కేవలం ఉద్యోగాలను తీసెయ్యడం పైనే కాక .. మనిషి .. రోబో యంత్రం కలిసి పని చేసేలా కొత్త ఉద్యోగాల కల్పన జరగాలి, జరుగుతుంది కూడా. అప్పుడే కృతిమ మేథ ఆధారిత పరిశ్రమలు సేవారంగం నిలుస్తుంది. అంటే భవిషత్తు లో కృతిమ మేథ చేసే పనిని దానికి వదిలేసి .. అది చేయలేని పనులు పనులపై మనిషి దృష్టి పెట్టాలి .
ఇకపై వారికే ఉద్యోగాలు
కృతిమ మేథను నడిపే వారు, కృతిమ మీద చేయలేని పనులు .. అంటే క్రియేటివిటీ క్రిటికల్ థింకింగ్ లాంటి స్కిల్స్ ఆధారిత పనులు చేసేవారికే ఇకపై ఉద్యోగాలు. కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది ... ఇప్పుడు అవుట్ డేటెడ్ రంగం . ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఇక ఉండవు. వారందరూ ఎఇ టూల్స్ కు అడాప్ట్ కావాలి. అంతకు మించి మానవ జీవన ఆధారిత స్కిల్స్ నేర్వాలి . అరటి పళ్ల బండి నుంచి (ఫోన్ పే) అమెజాన్ దాక ఇప్పుడు కంప్యూటర్స్ ను, నెట్ ను ఎలా వాడుతున్నారో... రేపు అలాగే కృతిమ మేథను అన్ని చోట్లా వాడుతారు . కృతిమ మేథను వాడలేని వారికి ... దానికి అడాప్ట్ కానివారికి ఉద్యోగాలు రావు. భవిత ఉండదు .

