- Home
- Entertainment
- పెద్ది నుంచి ప్యారడైజ్ వరకు.. 2026 లో రాబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలేంటో తెలుసా?
పెద్ది నుంచి ప్యారడైజ్ వరకు.. 2026 లో రాబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలేంటో తెలుసా?
2026లో పాన్ ఇండియా సినిమాలు భారీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి డిఫరెంట్ మూవీస్ ఆడియన్స్ ను అలరించబోతున్నాయి . యాక్షన్ మూవీస్ తో పాటు.. ఎమోషనల్ డ్రామాల కాన్సెప్ట్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి.

2026లో భారీ బడ్జెట్ చిత్రాలు
విభిన్న భాషలు, సంస్కృతులను కలిపి పాన్-ఇండియా సినిమాలు భారతీయ సినిమాను ఏకీకృతం చేస్తున్నాయి. 2026లో భారీ బడ్జెట్ చిత్రాలు రానున్నాయి. ఇవి అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది భారీగా సందడి నెలకొనబోతోంది.
ఫౌజీ
1940ల కాలం నాటి యుద్ధ డ్రామా కథతో తెరెక్కుతోన్న సినిమా ఫౌజీ. ఈసినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. రాజా సాబ్ తో ఫెయిల్యూర్ ను ఫేస్ చేసిన ప్రభాస్.. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
టాక్సిక్
1980ల గోవా నేపథ్యంలో 'టాక్సిక్' సినిమా తెరకెక్కుతోంది. గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగే హింసాత్మక పోరాటమే ఈ కథ. యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చి 19, 2026న విడుదల కానుంది.రీసెంట్ గా రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ టీజర పెద్ద వివాదానికి దారితీసింది. గీతూ మోహన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుంది.
డ్రాగన్
కెేజీయఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'డ్రాగన్'. 1969లో భారత్, చైనా, భూటాన్ సరిహద్దు ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. అనిల్ కపూర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈసినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను కంప్లీట్ గా మార్చేసుకున్నారు. ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ ఏడాది రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
పెద్ది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మరో పాన్ ఇండియా సినిమా పెద్ది. ఈమూవీకి బుచ్చిబాబు డైరెక్టర్. 1980ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ ఈ పెద్ది సినిమా. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పెద్ది.. క్రీడల ద్వారా తన గ్రామాన్ని ఏకం చేసే యువకుడి కథ ఇది. ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది.
ది ప్యారడైజ్
1980 ల కథతో, సికింద్రాబాద్ నేపథ్యంలో నాని హీరోగా వస్తున్న యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. తమ గౌరవం, గుర్తింపు కోసం పోరాడే గిరిజన తెగ కథ ఇది. నానీ లుక్స్ అయితే అదిరిపోయాయి. నేచురల్ స్టార్ ను ఈ రేంజ్ లో ఎప్పుడుూ చూసి ఉండరు. మార్చి 26, 2026న ఈ సినిమా విడుదల కాబోతోంది.
జైలర్ 2
'జైలర్' భారీ విజయం సాధించడంతో, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ సీక్వెల్‌లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే రొమాంటిక్ ఫాంటసీ కామెడీ వస్తోంది. నిజమైన ప్రేమ కోసం 2035కి టైమ్ ట్రావెల్ చేసే యువకుడి కథ ఇది. విఘ్నేష్ శివన్ దర్శకుడు.
మైసా
రష్మిక మందన్న శక్తివంతమైన గిరిజన మహిళ పాత్రలో నటిస్తోన్న సినిమా ‘మైసా’. చాలాపవన్ ఫుల్ లేడీగా రష్మిక నటిస్తోంది. తన జీవిత రహస్యాన్ని ఛేదించే ధైర్యవంతురాలైన మహిళ కథ ఇది. రవీంద్ర పుల్లే దర్శకుడు. ఈ సినిమా అద్భుతమైన విజువల్స్‌తో వస్తోంది.
స్వయంభూ
నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న 'స్వయంభూ' ఒక స్వర్ణయుగాన్ని సృష్టించిన చక్రవర్తి కథ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13, 2026న విడుదల కానుంది.

