హైదరాబాద్: ప్రజాకూటమి( మహాకూటమి)లో భాగస్వామ్యపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మూడు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. కాంగ్రెస్, సీపీఐ జాతీయ నాయకత్వాల మధ్య కుదిరిన ఒప్పందాల నేపథ్యంలో మూడు సీట్లలోనే  పోటీతో సీపీఐ రాష్ట్ర నాయకత్వం సంతృప్తి పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. సీపీఐ జాతీయ నేతలు సోమవారం నాడు  ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయనాయకత్వంతో చర్చించారు. మూడు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సానుకూలంగా స్పందించింది. 

ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గం మంగళవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమైంది.  కాంగ్రెస్ పార్టీ  ప్రతిపాదనపై చర్చించింది. దేశంలో నెలకొన్న రాజకీయపరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో మహాకూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండాలనే  ఉద్దేశ్యంతో  సీపీఐ నేతలు కూడ కొంత దిగి రావాల్సి వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న మూడు స్థానాల్లో పోటీకి సీపీఐ రెడీ చెప్పింది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. 

హుస్నాబాద్‌ నుండి  సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పోటీ చేస్తారు. బెల్లంపల్లిలో  సీపీఐ నేతల మధ్య పోటీ నెలకొంది. గుండా మల్లేష్‌ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో ఆయనకు వ్యతిరేకంగా సీపీఐ జిల్లా కార్యవర్గం తీర్మానం చేసింది.  సీపీఐ జిల్లా నేతలు మల్లేష్ పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ పరిస్థితుల నేపథ్యంలో  బెల్లంపల్లి నుండి  ఎవరిని బరిలోకి దింపుతారనేది ఆసక్తిగా మారింది. వైరా నుండి విజయను బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు.

కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య స్నేహాపూర్వక పోటీ, రెబెల్స్ బెడద ఉండకూడదని  సీపీఐ కోరుకొంటుంది. నల్గొండ జిల్లాలోని  దేవరకొండ లేదా మునుగోడు స్థానాల్లో ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ తమకు కేటాయిస్తోందోననే ఆశతో సీపీఐ రాష్ట్ర నాయకులు ఉన్నారు.

ఈ మూడు స్థానాల్లో  పోటీ చేసే అభ్యర్థుల జాబితాను  నవంబర్ 14వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్టు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?