ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. గురువారం నాడు న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. తెలంగాణలో 95 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది.
తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించేందుకుగాను కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజా కూటమి( మహాకూటమి)గా ఏర్పడ్డాయి. ఈ కూటమి సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది.
గురవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశమైంది.ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే 62 స్థానాల్లో అభ్యర్థులను ఈ సమావేశంలో ఫైనల్ చేశారు. నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు జాబితాను ప్రకటించనుంది.
నవంబర్ 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ మరోసారి సమావేశం కానుంది.ఈ సమావేశంలో మిగిలిన సీట్లలో కూడ అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. అన్ని అనుకొన్నట్టుగా జరిగితే నవంబర్ 8వ తేదీ రాత్రే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
నవంబర్ 8వ తేదీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వీలు కాకపోతే నవంబర్ 9వ తేదీన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 95 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. 24 సీట్లను మిత్ర పక్షాలను కేటాయించనుంది.
టీడీపీకి 14 సీట్లను కేటాయించింది. టీజేఎస్ ఎక్కువ సీట్లను కోరుతోంది. ఈ సీట్ల సర్దుబాటు కోసం టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో నవంబర్ రెండో తేదీన ఢిల్లీలో సమావేశం కానున్నారు. సీపీఐకి నాలుగు సీట్లు కేటాయించే అవకాశం ఉంది.దీంతో టీజేఎస్ కు 6 సీట్లు దక్కే అవకాశం ఉంది. అయితే సీపీఐ, టీజేఎస్ పోటీ చేసే స్థానాల సంఖ్యల్లో చివరల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని సమాచారం.
సంబంధిత వార్తలు
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?