న్యూఢిల్లీ: తాము బలంగా ఉన్న చోట పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నామని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు.  ఇతర పార్టీలు బలంగా ఉన్న స్థానాలను తాము కోరడం లేదన్నారు. సీట్ల సర్ధుబాటు విషయమై హైద్రాబాద్‌లో చర్చించునున్నట్టు కోదండరామ్ చెప్పారు. తాను పోటీ చేస్తానా లేదా అనే విషయమై ఇప్పుడే చెప్పలేనన్నారు. తన చుట్టూ చర్చ జరిగితే  కూటమికే నష్టమన్నారు.

న్యూఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్  రాహుల్ గాంధీతో టీజేఎస్ చీఫ్  కోదండరామ్‌ శుక్రవారం నాడు సమావేశమయ్యారు.  ఈ సమావేశం తర్వాత  కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. 

తాను పోటీ చేస్తే ఎలా ఉంటుంది.. లాభమా.. నష్టమా... అనే విషయమా చర్చ జరగడం వల్ల కూటమికి ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. కూటమికి నష్టం జరిగేలా తన చుట్టూ చర్చ జరగడం తన అభిమతం కాదన్నారు. 

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో 40 నిమిషాల పాటు  సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. కలలు కన్న తెలంగాణ కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు కోదండరామ్ చెప్పారు.

ఉమ్మడి కార్యాచరణ కోసం కలిసి పనిచేయాలని  కోరామన్నారు.  అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. కూటమి ద్వారా ప్రజల్లో మార్పు తేవాలని  భావిస్తున్నట్టు చెప్పారు.

కూటమిని త్వరగా ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని రాహుల్ ను కోరినట్టు కోదండరామ్ చెప్పారు. సీట్లకు సంబంధించిన చర్చలు రాహుల్ తో చర్చించలేదని కోదండరామ్ ప్రకటించారు.

సీట్ల పంపకాల గురించి కూడ ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కోరినట్టు తెలిపారు.  సీట్లకు చెందిన చర్చలను హైద్రాబాద్‌లో పూర్తి చేయాలని  కోరినట్టు చెప్పారు. సీట్ల పంపకం  న్యాయ సమ్మతంగా పూర్తి చేసుకోవాలని కోదండరామ్ తెలిపారు.

కూటమి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని  కోదండరామ్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. కూటమి ఏర్పాటులో కాలయాపన అనేది నష్టం చేస్తోందని కోదండరామ్ చెప్పారు. తమ పార్టీకి 15 సీట్లు కావాలని కోరుకొంటున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?