హైదరాబాద్: రెండు రోజుల్లో పొత్తుపై స్పష్టత ఇవ్వకపోతే  22 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని  టీజేఎస్  తేల్చి చెప్పింది. మహకూటమిలినో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు టీజేఎస్ ఈ ప్రకటనతో ఝలక్ ఇచ్చింది.

కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ విషయమై మహకూటమి పార్టీల మధ్య మంగళవారం నాడు సమావేశం జరగాల్సి ఉంది. కానీ, అమావాస్య కారణంగా ఈ సమావేశం బుధవారానికి వాయిదా పడింది.

మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా పూర్తి కాలేదు. పార్టీల మధ్య పొత్తుల చర్చలు సాగుతున్నాయి.  ఈ తరుణంలో టీజేఎస్ మంగళవారం నాడు మహాకూటమికి అల్టిమేటం జారీ చేసింది.

48 గంటల్లోపుగా పొత్తులు, సీట్ల సర్ధుబాటుపై తేల్చకపోతే  22 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అంతేకాదు తాము కోరినన్ని సీట్లు  ఇవ్వాల్సిందేననీ టీజేఎస్ డిమాండ్ చేస్తోంది. 

మహాకూటమి తమ డిమాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే  ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయాలనే యోచనలో టీజేఎస్  ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
టీజేఎస్ నేతల అల్టిమేటం నేపథ్యంలో  టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ  టీజేఎష్ చీఫ్ కోదండరామ్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
 

సంబంధిత వార్తలు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు