హైదరాబాద్: మహా కూటమి( ప్రజా కూటమి)లోని భాగస్వామ్య పార్టీల పట్ల కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని  మిగిలిన మూడు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. లోలోపల  కాంగ్రెస్ తీరుపై  తీవ్ర అసహనంగా ఉన్నప్పటికీ పైకి మాత్రం కాంగ్రెస్  తీరుపై సుతిమెత్తగా  ఈ మూడు  పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరి దయ కోసం  పాకులాడాల్సిన అవసరం లేదని ఈ మూడు పార్టీల నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.రేపటి వరకు ఏదో ఒకటి తేల్చేయాలని కూటమిలోని పార్టీలు కాంగ్రెస్ కు అల్లిమేటం ఇచ్చాయని సమాచారం.

సీట్ల సర్ధుబాటు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తేల్చకపోవడంపై   సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ నేతలు అసంతృప్తితో ఉన్నారు.  బుధవారం నాడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నివాసంలో  ఈ మూడు పార్టీల నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో  టీఆర్ఎస్‌ను గద్దె దించాలనే  ఉద్దేశ్యంతో మహాకూటమిని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ మూడు పార్టీలు గుర్తు చేస్తున్నాయి.

కానీ, కాంగ్రెస్ పార్టీ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఈ పార్టీల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. కూటమి అనుకొన్న లైన్లో నడవడం లేదనే అభిప్రాయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వ్యక్తం చేశారు.కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు ఈ మూడు పార్టీలకు రుచించడం లేదు. కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన తాము కూటమిని ఎందుకు నిర్వీర్యం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  చెప్పారు.  కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

కూటమి ఏర్పాటు విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన రాలేదన్నారు. ఎవరి కోసమో కూమిని ఏర్పాటు చేయలేదన్నారు.గడీల పాలనను  అంతం చేయాల్సిన అవసరం ఉందని చాడ వెంకట్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ టీడీపీ అనేక పార్టీలతో  పలు సందర్భాల్లో పొత్తులు పెట్టుకొందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ గుర్తుచేశారు. పొత్తుల కారణంగా అన్ని సమయాల్లో అనుకూలంగా ఫలితాలు రాలేదన్నారు. కూటమిలో సీట్ల సర్ధుబాటు విషయంలో  కొన్ని సమస్యలు ఏర్పడడం సహజమన్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర ఇచ్చామని.. ఆ పార్టీ ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ వెళ్లాలని రమణ కోరారు.

సీట్ల సర్దుబాటుతో కూటమికి లింకు చేయకూడదని  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. సీట్ల సర్ధుబాటు కోసం స్థానిక నాయకత్వంతోనే తాము చర్చించామన్నారు.  కాంగ్రెస్  పార్టీ  జాతీయ నాయకత్వంతో కొన్ని సమయాల్లో మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.

ప్రజా కూటమిలో  భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సీపీఐకు  2, టీడీపీకి 9, టీజేఎస్ కు 3 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సోమవారం రాత్రి ప్రతిపాదించింది. మంగళవారం నాడు కాంగ్రెస్ జాబితాను లీక్ చేసింది. దీంతో ఈ మూడు పార్టీల నేతలు కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉందనే  అభిప్రాయాన్ని ఒకానొక దశలో  కొందరు నేతలు వ్యక్తం చేశారని సమాచారం. ఎవరి దయదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని కొందరు నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం.రేపటి వరకు ఏదో ఒకటి తేల్చేయాలని మూడు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చాయి.ఈ విషయమై కాంగ్రెస్ ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.

 

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?