ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

మహా కూటమి (ప్రజా కూటమి)లో సీట్ల సర్ధుబాటు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయాన్ని తేల్చడం లేదని టీజేఎస్ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది

Seat-sharing with Congress: Unrest in TJS


హైదరాబాద్: మహా కూటమి (ప్రజా కూటమి)లో సీట్ల సర్ధుబాటు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయాన్ని తేల్చడం లేదని టీజేఎస్ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. సీట్ల సర్ధుబాటు తేలకపోవడంతో  గందరగోళం నెలకొంది.మరో వైపు టీజేఎస్, సీపీఐ కోరినన్ని సీట్లు ఇవ్వలేమని  కాంగ్రెస్ తేల్చి చెప్పింది. 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు గాను  కాంగ్రెస్,  టీడీపీ, సీపీఐ, టీజెఎస్‌ కూటమిగా పోటీ చేస్తున్నాయి.  ఈ కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు.

సీట్ల సర్దుబాటు విషయమై  కాంగ్రెస్ పార్టీ తీరుతో  టీజేఎస్  తీవ్ర అసంతృప్తితో ఉంది. టీఆర్ఎస్‌ను ఓడించే ఉద్దేశ్యంతో  కూటమిగా పనిచేయాలని నిర్ణయం తీసుకొన్న విషయాన్ని సీపీఐ నేతలు గుర్తు చేస్తున్నారు.

కానీ, సీట్ల సర్దుబాటు విషయంలో  కాంగ్రెస్ తీరుపై సీపీఐ నేతలు కూడ అసంతృప్తితో ఉన్నారు.ఉమ్మడి ప్రయోజనం కోసం  కొన్ని సీట్లు వదులుకొనేందుకు కూడ సిద్దమని  సీపీఐ నేతలు ప్రకటిస్తున్నారు. కానీ, కూటమికి తూట్లు పొడిచే విధంగా కొందరు నేతలు  ప్రచారం నిర్వహించడంపై  సీపీఐ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ  టీజేఎస్‌కు  12 నుండి 15 సీట్లు  ఇచ్చేందుకు  సంసిద్దతను వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు  నవంబర్ 1వ తేదీ నాటికి  టీజేఎస్ కు ఇచ్చే సీట్ల జాబితాను ఫైనల్ చేయాలని కాంగ్రెస్   పార్టీ  ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే టీజేఎస్ కోర్ కమిటీ సోమవారం నాడు  సమావేశమైంది.  కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన కొనసాగుతున్నందున  టీజేఎస్  కనీసం 15 నుండి 20 సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని  నిర్ణయం తీసుకొంది.

కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నందున టీజేఎస్ ఈ నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్ పార్టీ ఇలానే జాప్యం చేస్తే  తాము పోటీచేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాను రెండు మూడు రోజుల్లో ప్రకటించాలని టీజేఎస్ నిర్ణయం తీసుకొంది.

ఉద్దేశ్యపూర్వకంగానే  కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయాన్ని తేల్చడం లేదని టీజేఎస్ కోర్ కమిటీ అభిప్రాయపడింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయంలో సాచివేత ధోరణిని అవలంభిస్తే సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌తో చర్చించాలని కూడ టీజేఎస్  కోర్ కమిటీ లో  కొందరు అభిప్రాయపడ్డారు. 

బీఎల్‌ఎఫ్  టీజేఎస్ కు కనీసం 8 సీట్లు ఇచ్చేందుకు  సంసిద్దతను వ్యక్తం చేసిన విషయాన్ని కొందరు నేతలు ఈ సమావేశంలో గుర్తు చేశారు.  ఇదిలా ఉంటే ఈ రెండు కూటములు  సాధ్యం కాకపోతే బీజేపీతో జత కట్టాలనే చర్చ కూడ సాగింది. అయితే టీజేఎస్ లో ఎక్కువ లెఫ్ట్ భావజాలం ఉన్నవారున్నందున... చివరి ఆఫ్షన్‌ గా బీజేపీని  ఎంచుకొన్నారు. 

టీజేఎస్ చీఫ్ కోదండరామ్ సమక్షంలోనే కోర్ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా తేల్చి చెప్పారు.  అయితే సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొన్న కోదండరామ్... కాంగ్రెస్ పార్టీ వద్ద  మన డిమాండ్లను ఉంచుతానని కోర్ కమిటీలో తేల్చిచెప్పినట్టు  సమాచారం.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతలు మహా కూటమిలోని పార్టీలతో  కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం నాడు  చర్చించారు.మహాకూటమిలోని పార్టీలు కోరినన్ని సీట్లు ఇవ్వలేమని  కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పినట్టు సమాచారం. టీడీపీకి 9, టీజేఎస్ కు 3, సీపీఐకి 2 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసినట్టు సమాచారం.సోమవారం నాడు స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత  కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా కూటమిలోని  పార్టీ నేతలకు  సమాచారాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రతిపాదనపై  టీజేఎస్, సీపీఐ నేతలు  తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దీంతో  కాంగ్రెస్ నేతలు సీపీఐ, టీజేఎస్ నేతలను బుజ్జగించే  ప్రయత్నాలు చేస్తున్నారు.

టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కు డిప్యూటీ సీఎం లేదా రాజ్యసభ సీటు, సీపీఐ నేతలకు కీలకమైన కార్పోరేషన్లకు ఛైర్మెన్ పదవులు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే  ఈ విషయమై  కాంగ్రెస్ ప్రతిపాదనపై  సీపీఐ, టీజేఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. 

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని  టీడీపీ నేతలు చెబుతున్నారు.  తమకు సీట్లు ముఖ్యం కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

 

సంబంధిత వార్తలు

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios