హైదరాబాద్: టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌తో కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం నాడు చర్చలు జరుపుతున్నారు. కనీసం 12 సీట్లు ఇవ్వాలని టీజేఎస్  కోరుతోంది.కానీ, కాంగ్రెస్ పార్టీ  మాత్రం 8 సీట్లు ఇచ్చేందుకు  సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.  అయితే ఈ విషయమై  రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు  తుది దశకు చేరుకొన్నట్టు సమాచారం.

 టీజేఎస్ నేతలు కనీసం తమకు  16 సీట్లు కావాలని  కోరుతున్నారు.  అయితే 12 సీట్లకు తగ్గొద్దని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం 8 సీట్లు ఇచ్చేందుకే ఒప్పుకొన్నారని సమాచారం.

ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయమై  నియోజకవర్గాల వారీగా పొత్తులపై  చర్చ జరుగుతోంది.  మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, టీజేఎస్,  టీడీపీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో  సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ తీరుపై  టీజేఎస్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో టీజేఎస్ తో సీట్ల సర్ధుబాటు కోసం  కాంగ్రెస్ నేతలు  ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్ని సీట్లు టీజేఎస్ కు ఇచ్చే విషయమై ఇంకా ఫైనల్ కాకపోయినా..... ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయమై టీజేఎస్  ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. మహా కూటమి ముందు  సుమారు 12 సీట్లకు పైగా   ఆ పార్టీ  ప్రతిపాదించింది.

మహాబూబ్‌నగర్, ముథోల్, జడ్చర్ల, మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, పెద్దపల్లి, ఆశ్వరావుపేట, నాంపల్లి, రామగుండం, అంబర్ పేట, ఖైరతాబాద్, మహాబూబాబాద్,  మలక్ పేట, జూబ్లీహిల్స్ స్థానాలను  టీజేఎస్  కోరుతోంది.

మిర్యాలగూడ నుండి  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ తరుణంలో  ఈ సీటును కాంగ్రెస్ వదులుకొంటుందా అనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది. కుటుంబంలో ఒక్క టిక్కెట్టు  మాత్రమే ఇస్తామని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రకటిస్తే ఈ సీటును వదులుకొనేందుకు జానారెడ్డి  సిద్దంగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

 అయితే  కొన్ని కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలను కూడ టీజేఎస్ అడుగుతోంది.  ఈ స్థానాలను ఆ పార్టీ ఇస్తోందా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ,  కొన్ని సీట్ల విషయంలో పట్టు విడుపులు  ప్రదర్శించాలని టీజేఎస్ కూడ  అభిప్రాయంతో ఉంది.


సంబంధిత వార్తలు

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?