Asianet News TeluguAsianet News Telugu

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై  సీపీఐ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు

cpi emergency state executive committee meeting on nov 11
Author
Hyderabad, First Published Nov 7, 2018, 3:54 PM IST


హైదరాబాద్: ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై  సీపీఐ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చరుకోవాలని సీపీఐ నిర్ణయానికి వచ్చింది.ఈ నెల 9వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా సమావేశం కానుంది.ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది.

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 95 స్థానాల్లో పోటీ చేయనుంది. 24 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. అయితే సీపీఐ, టీజేఎస్ స్థానాల విషయంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. 

టీజేఎస్ పోటీ చేసే స్థానాల జాబితాను కాంగ్రెస్ ఇచ్చింది.11 స్థానాల జాబితా ఇచ్చి... రెండు స్థానాల్లో స్నేహాపూర్వక పోటీ అంటూ మెలిక పెట్టింది. ఈ ప్రతిపాదనపై టీజేఎస్ అసంతృప్తితో ఉంది. మరో వైపు సీపీఐ కూడ కాంగ్రెస్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

మూడు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదిస్తే...  నాలుగు ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని సీపీఐ కోరింది. కానీ, బుధవారం నాడు ఫైనల్ గా బెల్లంపల్లి, వైరా, ఆసిఫాబాద్ సీట్లను ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.

కాంగ్రెస్ తీరుపై సీపీఐ అసంతృప్తితో రగిలిపోతోంది. గంటకో లీకులు ఇస్తూ తమను అవమానపరుస్తోందని సీపీఐ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. నవంబర్ 9వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు విషయమై సీపీఐ చర్చించనుంది.

కొత్తగూడెం  సీటు ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. కొత్తగూడెం సీటును కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. తాము 9 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరిన విషయాన్ని సీపీఐ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ, కనీసం 4 సీట్లు ఇవ్వాలని కోరినా కూడ కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలమైన స్పందన లేదని సీపీఐ నేతలు అసహనంగా ఉన్నారు.

కాంగ్రెస్ లీకులపై తాము అసంతృప్తితో ఉన్నామని చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు విషయమై ఏదో ఒకటి తేల్చేందుకు సీపీఐ జాతీయ నాయకులు డి. రాజాను కూడ ఆ పార్టీ నాయకత్వం రంగంలోకి దింపింది.

సంబంధిత వార్తలు

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios