హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విచ్చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాకూటమిలో పొత్తు, సీట్ల సర్ధుబాటు వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 

మరోవైపు ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాకపోవడంతో టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా కొలిక్కిరాకపోవడంతో టీ టీడీపీ నేతలు చంద్రబాబుతో చర్చించనున్నారు. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయాలు, టీడీపీ నేతల మనోభవాలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నారు టీ టీడీపీ నేతలు.