ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
ప్రజా కూటమి( మహాకూటమి) సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ లీకులు ఇవ్వడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ప్రజా కూటమి( మహాకూటమి) సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ లీకులు ఇవ్వడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. నవంబర్ 4వ తేదీన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు.
శుక్రవారం నాడు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా కూటమి లో సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ అసంబద్దమైన లీకులిస్తోందని ఆయన అసంతృప్తితో ఉన్నారు. రెండు,మూడు సీట్ల అంటూ కాంగ్రెస్ చేస్తోన్న ప్రచారంతో తమ పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.
నవంబర్ 4వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గంలో తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నట్టు చాడ స్పష్టం చేశారు. ఎవరో ఏర్పాటు చేసిన ఫ్రంట్‌లకు తాము వెళ్లమని తేల్చేశారు.
రాజకీయ లక్ష్యం కోసమే కూటమిని ఏర్పాటు చేసినట్టు చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. కూటమిలోని భాగస్వామ్యపక్షాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉండాలని చాడ అభిప్రాయపడ్డారు.కూటమి ఏర్పాటై 50 రోజులైందని ఆయన గుర్తుచేశారు. కూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై తాము సర్దుబాటు ధోరణిలోనే ఉన్నామని ఆయన తెలిపారు.
సంబంధిత వార్తలు
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?