హైదరాబాద్: ప్రజా కూటమి( మహా కూటమి)లోని భాగస్వామ్యపార్టీల మధ్య  సీట్ల సర్ధుబాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వజూపుతున్న  సీట్ల విషయంలో  మిత్రపక్షాలు  కొంత అసంతృప్తితో ఉన్నాయి.  ఎక్కువ సీట్లను  మిత్రపక్షాలు కోరుతున్నాయి. అయితే మిత్రపక్షాలు కోరుతున్న సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.  ఇందులో 95 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన 24 సీట్లను మిత్రపక్షాలను కేటాయించింది. టీడీపీ 18 సీట్లు కోరుతోంది.  

అయితే  కేవలం 14 సీట్లు టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమైన సమావేశంలో  తెలంగాణలో సీట్ల గురించి చర్చించే అవకాశం లేకపోలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

టీజేఎస్‌ తమకు కనీసం 12 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. కానీ, 8 సీట్ల కంటే ఎక్కువ సీట్లను ఇచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.  టీజేఎస్ చీఫ్ కోదండరామ్  శుక్రవారం నాడు  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో  సమావేశం కానున్నారు. 

సీట్ల సర్దుబాటు విషయమై  రాహుల్ తో కోదండరామ్ చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే కోదండరామ్‌కు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ విషయమై కూడ రాహుల్‌ నుండి కోదండరామ్ కు హామీ లభించే అవకాశం లేకపోలేదు.

మరో వైపు  సీపీఐ కనీసం  ఐదు స్థానాలు ఇవ్వాలని కోరుతోంది.  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో పాటు ఆపార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి తెలంగాణలో ఐదు సీట్లను కేటాయించాలని  కోరారు. అయితే ఈ విషయమై పార్టీ నేతలతో చర్చించి చెబుతానని ఆ పార్టీ జాతీయ నాయకులు సీపీఐ నేతలకు సమాచారమిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ ఉదయం ముగిసింది.  ఈ సమావేశం తర్వాత  మిత్రపక్షాలకు కేటాయించే సీట్లు, ఆ పార్టీలు కోరుతున్న స్థానాలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం చర్చించనుంది.

సంబంధిత వార్తలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?