Asianet News TeluguAsianet News Telugu

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

ప్రజాకూటమి(మహాకూటమి) సీట్ల సర్దుబాటు విషయమై తాడో పేడో తేల్చుకొనేందుకు సీపీఐ నేతలు సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనే  సీపీఐ నేతలు సీట్ల విషయాన్ని తేల్చుకోనున్నారు.

Telangana cpi state secretary chada venkat reddy plans to meet congress key leaders in delhi
Author
Hyderabad, First Published Nov 12, 2018, 1:38 PM IST


హైదరాబాద్: ప్రజాకూటమి(మహాకూటమి) సీట్ల సర్దుబాటు విషయమై తాడో పేడో తేల్చుకొనేందుకు సీపీఐ నేతలు సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనే  సీపీఐ నేతలు సీట్ల విషయాన్ని తేల్చుకోనున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను  గద్దె దించేందుకుగాను  కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లు  ప్రజా కూటమి‌గా ఏర్పడ్డాయి. అయితే  టీడీపీకి 14, సీపీఐ3, టీజేఎస్‌కు 8 స్థానాలను, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క స్థానాన్ని కేటాయించింది.

అయితే సీపీఐ, టీజేఎస్‌ల సీట్ల సర్దుబాటు విషయంలో  కాంగ్రెస్ పార్టీ తో ఈ రెండు పార్టీల మధ్య ఇంకా ఏకాభిప్రాయం  కుదరలేదు. టీడీపీకి కూడ నాలుగు స్థానాల విషయంలో  కూడ స్పష్టత రావాల్సి ఉంది.

సీపీఐ కూడ సీట్ల విషయంలో కూడ కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉంది. కనీసం 5 స్థానాలను ఇవ్వాలని సీపీఐ ప్రతిపాదిస్తోంది. తాము పోటీచేసే  5 స్థానాలను కూడ సీపీఐ ఇప్పటికే ప్రకటించింది.

బెల్లంపల్లి, వైరా,హుస్నాబాద్,కొత్తగూడెం, మునుగోడు లేదా దేవరకొండ స్థానాలను సీపీఐ కోరుతోంది.కానీ  బెల్లంపల్లి,వైరా, హుస్నాబాద్ స్థానాలను సీపీఐకు కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉంది.

సీపీఐ మాత్రం  కొత్తగూడెం సీటు ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో  సీట్ల సర్దుబాటును ఇంకా ఫైనల్ చేయకపోవడంపై  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఈ తరుణంలో  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పల్లా వెంకట్ రెడ్డి,  కూనంనేని సాంబశివరావులు సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు.

సీట్ల సర్ధుబాటు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో తేల్చుకోనున్నారు.టీజేఎస్, సీపీఐ, టీడీపీలతో సీట్ల సర్దుబాటు విషయాన్ని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా వివరించారు.

సంబంధిత వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios