Asianet News TeluguAsianet News Telugu

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

టీఆర్ఎస్ పార్టీని ఓడించడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమి పేరుకు మార్చాలని ఇప్పటికే టిపిసిసి చీఫ్ ఉత్తమ్ తో పాటు వామపక్ష పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చాయి. దీంతో మహాకూటమి పేరును ప్రజా కూటమిగా మార్చినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడక పోయినా దాదాపు ఈ పేరు ఖరారైనట్లు సమాచారం.
 
mahaakootami name changed as a prajakootami
Author
Hyderabad, First Published Oct 13, 2018, 3:38 PM IST

టీఆర్ఎస్ పార్టీని ఓడించడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమి పేరుకు మార్చాలని ఇప్పటికే టిపిసిసి చీఫ్ ఉత్తమ్ తో పాటు వామపక్ష పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చాయి. దీంతో మహాకూటమి పేరును ప్రజా కూటమిగా మార్చినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడక పోయినా దాదాపు ఈ పేరు ఖరారైనట్లు సమాచారం.

అయితే మహాకూటమి పేరును మార్చడానికి వివిధ కారణాలన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి అప్పటి టిడిపి, టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు జతకట్టి మహాకూటమి పేరుతో బరిలోకి దిగాయి. అయితే విజయం మాత్రం సాధించలేకపోయాయి. ఇలా పెయిల్యూర్ పేరును మళ్లీ వాడటం సరికాదని కూటమిలోని పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

అంతే కాకుండా ప్రజల కోసమే కూటమి ఏర్పడినట్లు పేరు ఉండాలని భావించాయి. అందువల్ల ప్రజాకూటమి అన్న పేరు బావుంటుందని పార్టీలన్ని భావించి నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రజా సమస్యల కోసం ఈ కూటమి ఏర్పడినట్లు చెప్పకనే చెప్పడం ద్వారా ప్రజల్లో కూడా సదభిప్రాయం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత పేరు మార్ప ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios