ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ
కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సీట్లపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తోంది.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సీట్లపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తోంది.తాము కోరుతున్న స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తుండడంపై సీపీఐ నేతలు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాలుగు అసెంబ్లీ, ఒక్క ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. సీట్ల సంఖ్య ఒప్పుకొన్నా.... తాము కోరుకొన్న స్థానాలను ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొంది. మిత్రపక్షాలకు 26 స్థానాలను కేటాయించనుంది. సీపీఐకి3, టీజేఎస్‌కు 8, టీడీపీకి 14 స్థానాలను
కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సీట్లపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం నాడు చర్చించేందుకు గాను అత్యవసరంగా సమావేశమైంది. కనీసం నాలుగు అసెంబ్లీ, ఒక్క ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించాలని సీపీఐ కోరుతోంది. హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి స్థానాలను ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.
కానీ సీపీఐ మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని కోరుతోంది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీటు ఇవ్వాల్సిందేనని సీఫీఐ డిమాండ్ చేస్తోంది. హుస్నాబాద్, వైరా స్థానాల్లో సీపీఐ సానుకూలంగానే ఉంది. కానీ బెల్లంపల్లికి బదులుగా మంచిర్యాల స్థానం ఇవ్వాలని సీపీఐ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరింది.మంచిర్యాల స్థానం విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీటు విషయంలో కాంగ్రెస్ మాత్రం సీరియస్‌గా ఉంది. ఈ స్థానాన్ని సీపీఐకు ఇవ్వబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కూనంనేని సాంబశివరావు ఐదవ స్థానంలో నిలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా నాగేశ్వరరావు వైపే ఆ పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోంది.
అయితే కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సీట్ల విషయమై ఏం చేయాలనే దానిపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం నాడు అత్యవసరంగా హైద్రాబాద్ మగ్దూం భవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు విషయమై ప్రదానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
దేవరకొండ, కొత్తగూడెం అసెంబ్లీ సీట్ల విషయాల్లో కాంగ్రెస్ పార్టీపై సీపీఐ ఒత్తిడి చేస్తోంది. కొత్తగూడెం సీటు విషయాన్ని వదులుకొనేందుకు సీపీఐ సిద్దంగా లేదు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాలుగు సీట్లకు వెనక్కు తగ్గొద్దని సీపీఐ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయంతో ఉంది. దేవరకొండ సీటును వదులుకొన్నా... కొత్తగూడెం సీటును మాత్రం వదులుకొనేందుకు సిద్దంగా లేదు. అయితే రాష్ట్ర కార్యవర్గంలో సీపీఐ ఏ నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సంబంధిత వార్తలు
సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?