పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు ఇవాళ ఫైనల్ కానుందని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు ఇవాళ ఫైనల్ కానుందని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు.పొత్తులపై తమకు సానుకూలత ఉందన్నారు.. పొత్తులు ఫైనలయ్యాక అభ్యర్థులను ప్రకటించనున్నట్టు ఆయన ప్రకటించారు.
తెలంగాణ జనసమితి మేనిఫెస్టోను సోమవారం నాడు పార్టీ కార్యాలయంలో టీజేఎస్ చీఫ్ కోదండరామ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.తాము పది సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. తమ పార్టీకి గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు ఉన్నారని కోదండరామ్ చెప్పారు. పొత్తులపై జాప్యం వల్ల ప్రజా సంఘాల్లో, కూటమిలో కొంత నిరుత్సాం నెలకొన్న మాట వాస్తవమేనని ఆయన చెప్పుకొచ్చారు.
దీపావళి నాటికి అభ్యర్థులను ప్రకటించి... ప్రచారాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. దసరా నాటికి కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావించాం... కానీ, సాధ్యం కాలేదన్నారు. కనీసం దీపావళి నాటికైనా అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
కూటమిని తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని కోదండరామ్ చెప్పారు. కూటమి నిర్మాణంలో నెల రోజుల పాటు ఆలస్యం కావడం కొంత నిరాశ కల్గించిందన్నారు.ఇకనైనా కూటమి నిర్మాణంలో వేగంగా అడుగులు పడే అవకాశం ఉందన్నారు.
సీపీఐ సీట్ల సర్ధుబాటు అంశాన్ని తమ సమస్యగా భావిస్తామన్నారు.ఉద్యమంలో కూడ సీపీఐ తమతో కలిసి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీపీఐతో పాటు, తమ పార్టీ సీట్ల సర్దుబాటు సోమవారం సాయంత్రం నాటికి ఫైనలయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ప్రజా కూటమి బలోపేతం కావాలని కోరుకొనే ప్రజా సంఘాలు, వ్యక్తులు, సంస్థలు తమ శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిందిగా కోదండరామ్ పిలుపునిచ్చారు.నిరంకుశ పాలన అంతం కావాలని కోరుకొనే వారంతా కూటమి కోసం పనిచేయాలని ఆయన విన్న వించారు. కూటమి ఏర్పాటు కాకుండా టీఆర్ఎస్ కుట్రలకు పాల్పడిందని కోదండరామ్ ఆరోపించారు.
ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక శక్తులు ప్రజా బలంతోనే నిలబడుతాయని చెప్పారు.. తెలంగాణ ప్రజలు ఈ కూటమిని నిలబట్టేందుకు సహాయం చేయాలని ఆయన కోరారు. ప్రతి ప్రజా సంఘం శక్తివంచన లేకుండా కూటమిని బలోపేతంచేసేందుకు ప్రయత్నించాలన్నారు.కూటమి నుండి . సీపీఐ బయటకు వెళ్తే కూటమికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
కూటమి నిర్మాణం ఓపికగా చేయాలన్నారు.ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ కూడ సీట్ల సర్దుబాటు విషయంలో సీరియస్ గా ఉందన్నారు. తమ పార్టీ ఎన్నికల గుర్తుగా అగ్గిపెట్టును ఫైనల్ చేశామన్నారు. కానీ, ఎన్నికల సంఘం అఫ్రూవల్ పూర్తి కాగానే ప్రకటిస్తామన్నారు.
సంబంధిత వార్తలు
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?