సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం
ప్రజా కూటమి (మహాకూటమి) సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఇంకా 4 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
హైదరాబాద్: ప్రజా కూటమి (మహాకూటమి) సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఇంకా 4 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఏకాభిప్రాయం కుదరకపోతే తెలుగు తమ్ముళ్లు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.
ప్రజా కూటమి( మహా కూటమి)లో భాగస్వామిగా ఉన్న టీడీపీకి 14 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది కాంగ్రెస్. అయితే ఈ 14 స్థానాల్లో 10 స్థానాల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఇంకా నాలుగు స్థానాల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.ఈ పది స్థానాల విషయంలో టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సత్తుపల్లి, ఖమ్మం, ఆశ్వరావుపేట, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మక్తల్, మహాబూబ్ నగర్, రాజేంద్రనగర్, వరంగల్ వెస్ట్ స్థానాల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. ఎల్‌బీనగర్, ఆలేరు, కోదాడ, పటాన్‌చెరువు స్థానాల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఎల్బీ,నగర్ స్థానాలను టీడీపీ డిమాండ్ చేస్తోంది. సనత్‌నగర్ స్థానానికి బదులుగా సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌కు బదులుగా ఖైరతాబాద్, ఎల్బీనగర్ కు బదులుగా ఇబ్రహీంపట్నం స్థానాన్ని ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టీడీపీకి సమాచారం ఇచ్చినట్టు సమాచారం.
కోదాడలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ పై ఉత్తమ్ భార్య విజయం సాధించారు.
అయితే సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ వదులుకొంటుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎల్బీనగర్ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఆర్ కృష్ణయ్య విజయం సాధించారు.
ఈ స్థానం కోసం టీడీపీ నేత సామ రంగారెడ్డి పట్టుబడుతున్నారు. ఒక్కరోజు సామ రంగారెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కు ఎలా వదిలేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఆలేరు నుండి తాను అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పినట్టు సమాచారం.
పటాన్‌చెరువు నుండి ఇటీవలనే పార్టీలో చేరిన నందీశ్వర్ గౌడ్ టీడీపీ టికెట్టు ఆశిస్తున్నారు. పటాన్‌చెరువు సీటును కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయిస్తోందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సంబంధిత వార్తలు
కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం
కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు
మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ
మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు
ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్
కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....
ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ
సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?