Asianet News TeluguAsianet News Telugu

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, టీజెఎస్, సిపిఐలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీకి సిద్దమయ్యాయి. ఇందుకోసం కూటమిలోని పార్టీలకు సీట్లు కేటాయిస్తూ కాంగ్రెస్ గురువారం ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే సీట్లను కేటాయించే విషయంలో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కూటమిలోని పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 
 
cpi demands to mahakutami
Author
Hyderabad, First Published Nov 9, 2018, 6:35 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, టీజెఎస్, సిపిఐలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీకి సిద్దమయ్యాయి. ఇందుకోసం కూటమిలోని పార్టీలకు సీట్లు కేటాయిస్తూ కాంగ్రెస్ గురువారం ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే సీట్లను కేటాయించే విషయంలో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కూటమిలోని పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 

 కూటమిలోని మరో పార్టీ సిపిఐ అయితే సీట్ల సంఖ్య...కేటాయించిన స్థానాలు రెండింటిపైనా అసంతృప్తితో ఉంది. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు ఇవాళ ఉదయం నుండి  టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టిటిడిపి అధ్యక్షుడు రమణలతో చాడ వెంకట్ రెడ్డి చర్చలు జరిపారు. చివరకు ఉత్తమ్ ను కలవాలని భావించినా ఆయన అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో భైటీ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని సీట్లను కేటాయించిందని సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము నాలుగు జిల్లాల్లో ప్రాతినిధ్యం ఉండేట్లు చూడాలని కోరామని....అయితే కాంగ్రెస్ మాత్రం ఖమ్మం జిల్లాలోని వైరా, ఆదిలాబాద్ లోని బెల్లంపల్లి, కరీంనగర్ లోని హుస్నాబాద్ సీట్లను మాత్రమే కేటాయించిందని తెలిపారు. తాము కోరినట్లు కొత్తగూడెం, మునుగోడు స్థానాలు తమకే కావాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నట్లు తెలిపారు. 

తెలంగాణ తెలుగుదేశం పార్టీతో పాటు తెలంగాణ జన సమితిలు కూడా ఈ సీట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సీట్ల  సంఖ్య విషయంలో అసంతృప్తి లేకపోయినప్పటికి కేటాయించిన స్థానాలపైన ఈ పార్టీలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
 
Follow Us:
Download App:
  • android
  • ios