Asianet News TeluguAsianet News Telugu

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో  సమావేశమయ్యారు.

Telangana Tdp leaders meeting with chandrababunaidu in Hyderabad
Author
Hyderabad, First Published Oct 22, 2018, 10:44 AM IST

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో  సమావేశమయ్యారు. మహాకూటమి(ప్రజా కూటమి) సీట్ల సర్ధుబాటు, ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయాలపై  చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

మహాకూటమి ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితిలను ఏకతాటిపైకి తీసుకురావడంలో  టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఎల్. రమణతో పాటు ఆ పార్టీ నేతలు కృషి చేశారు. 

మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా తేలలేదు. ఈ విషయమై పార్టీల మధ్య  ఇంకా చర్చలు  సాగుతున్నాయి.  ఈ తరుణంలో  తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే   విషయమై  చంద్రబాబునాయుడుతో టీడీపీ తెలంగాణ  రాష్ట్ర కమిటీ  నేతలు సోమవారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో సమావేశమయ్యారు.

మూడు దశలుగా చంద్రబాబునాయుడు  టీటీడీపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో  బాబు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి... ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై ప్రధానంగా చర్చించనున్నారు.  అంతేకాదు బలమైన స్థానాలను వదులుకోకుండా ఉండాలనే అభిప్రాయాన్ని కొందరు నేతలు చంద్రబాబునాయుడు వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం.  ఆదివారం నాడు కూడ చంద్రబాబుతో  టీడీపీ నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశాలకు కొనసాగింపుగానే  సోమవారం నాడు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం.... ఎన్నికల మేనిఫెస్టో తదితర  విషయాలపై  చంద్రబాబునాయుడుతో పార్టీ నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో ముసాయిదా దాదాపుగా పూర్తైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాబు ఆమోదం తీసుకొన్న తర్వాత  మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోనే ఎక్కువ సీట్లను  టీడీపీ నేతలు కోరుతున్నారు. అయితే  కాంగ్రెస్ తో పాటు  టీజేఎస్ కూడ గ్రేటర్ హైద్రాబాద్  పరిధిలో కొన్ని సీట్లను కోరుతున్నాయి.  ఈ సీట్ల విషయంలో ఏం చేయాలనే విషయమై కూడ బాబుతో పార్టీ నేతలు చర్చించనున్నారు. సీట్ల సర్దుబాటు పూర్తి చేస్తే  ప్రచారాన్ని ప్రారంభించాలని  టీడీపీ నేతలు భావిస్తున్నారు. బాబుతో సమావేశం ముగిసిన తర్వాత మహాకూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలతో టీడీపీ నేతలు సమావేశమయ్యే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios