కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
ప్రజా కూటమి(మహా కూటమి) లో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఫైనల్ కాలేదు. సీపీఐకు తాజాగా కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రతిపాదనలు ముందు పెట్టింది.
హైదరాబాద్: ప్రజా కూటమి(మహా కూటమి) లో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఫైనల్ కాలేదు. సీపీఐకు తాజాగా కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రతిపాదనలు ముందు పెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్ధుబాటు విషయమై తాడో పేడో తేల్చుకోవాలని సీపీఐ నిర్ణయానికి వచ్చింది. మంగళవారం నాడు సీపీఐ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.
భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయమై త్వరగా తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తాము పోటీ చేసే 9 స్థానాల వివరాలను సీపీఐ సోమవారం నాడు సాయంత్రం ప్రకటించింది
అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. 40 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది.
ఇదిలా ఉంటే సీపీఐకు మూడు ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ స్థానాలను ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రతిపాదించింది. ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్సీ స్థానాలను ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలకు సీపీఐ అంతగా సానుకూలంగా లేదు. నాలుగు ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని సీపీఐ కోరుతోంది.
సంబంధిత వార్తలు
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టిక్కట్టు లేనట్టే...
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?