హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  అడుగులు వేస్తోంది. మంగళవారం నాడు  ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్కీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. అన్నీ అనుకొన్నట్టుగా సాగితే నవంబర్ 8 రాత్రి లేదా నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.

కాంగ్రెస్ పార్టీ స్క్రినింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశంలో పాల్గొనేందుకు గాను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి,  మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ఢిల్లీకి వెళ్లారు.  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్  భక్త చరణ్ దాస్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను  ఫైనల్ చేయనున్నారు.  వారం రోజుల క్రితం న్యూఢిల్లీలో రాహుల్ సమక్షంలో జరిగిన సమావేశంలో సుమారు 57 మంది అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది  కాంగ్రెస్ పార్టీ. 

తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉన్నాయి. ఇందులో 95 స్థానాలకు  కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన  24 స్థానాలను టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు కేటాయించనుంది. టీడీపీకి 14 స్థానాలను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. మిగిలిన 10 స్థానాల్లో టీజేఎస్, సీపీఐలకు కేటాయించనుంది.

అయితే  సీట్ల సర్దుబాటు విషయంలో భాగస్వామ్యపక్షాలు  కాంగ్రెస్ పార్టీపై  తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తాము పోటీ చేసే 9 స్థానాలను సీపీఐ సోమవారం నాడు ప్రకటించింది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్  సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు.

కాంగ్రెస్ పార్టీ కేటాయించనున్న సీట్ల జాబితాను  కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదండరామ్‌కు అందించారు. ఈ జాబితాపై  పార్టీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని కోదండరామ్  తేల్చిచెప్పారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఢిల్లీలో ప్రారంభమైంది.  భాగస్వామ్యపార్టీలకు  సీట్ల కేటాయింపు పూర్తైన తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

 కాంగ్రెస్ పార్టీ అందించిన జాబితాపై టీజేఎస్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. మరో వైపు సీపీఐకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారనే విషయమై ఇంకా  స్పష్టత రావాల్సి ఉంది. రెండు రోజుల్లోపుగా  ఈ విషయమై స్పష్టత వస్తే  కాంగ్రెస్ పార్టీ 9వ తేదీన తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఉమ్మడిగా ప్రజా కూటమి అభ్యర్థుల జాబితాను కూడ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?