కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
మహా కూటమి (ప్రజా కూటమి)లో సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ తీరుపై మిగిలిన మూడు పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
హైదరాబాద్: మహా కూటమి (ప్రజా కూటమి)లో సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ తీరుపై మిగిలిన మూడు పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కూటమిలోని పార్టీల మధ్య చర్చలు పూర్తి కాకముందే కాంగ్రెస్ జాబితా లీకు కావడంపై టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తీరుపై ఈ మూడు పార్టీలు బుధవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యాయి.ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచారు.
మహాకూటమిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. కానీ సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ధోరణితో ఈ మూడు పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా పేరుతో సుమారు 56 మంది పేర్లను బయటకు లీక్ చేయడంపై ఈ మూడు పార్టీల నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
75 మంది జాబితాతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ జాబితా లీక్ కావడంపై టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌లు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఇంట్లో బుధవారం నాడు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై చర్చించారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ మూడు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీకి జాబితాలను సమర్పించాయి. కానీ తాము కోరుతున్న సీట్లలో కూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల పేర్లను లీక్ చేయడంపై ఈ మూడు పార్టీల నేతలు కొంత అసహనంతో ఉన్నారు.ఇదే విషయమై చర్చించారు.
టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకువెళ్తున్న తరుణంలో కనీసం సీట్ల సర్దుబాటు పూర్తి కాకపోవడంతో ఈ పార్టీలు ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. ప్రజా కూటమికి సంబంధించి కనీస ఉమ్మడి ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదు. ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటే నష్టం జరిగే అవకాశం ఉందని ఈ మూడు పార్టీల నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పైకి కాంగ్రెస్ పార్టీ తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తోందని చెబుతున్నా.... లోలోపల మాత్రం ఆ పార్టీ తీరుతో ఈ మూడు పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
సంబంధిత వార్తలు
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?