సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

సీపీఐకు మూడు సీట్లను  కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది. 

congress ready to give three seats to cpi

హైదరాబాద్: సీపీఐకు మూడు సీట్లను  కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది. అయితే ఈ విషయమై సీపీఐ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. మరో వైపు సీపీఐ కార్యాలయానికి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ వెళ్లి సీపీఐ నేతలతో బుధవారం నాడు చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను గద్దె దించేందుకుగాను కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణలోని 119 స్థానాల్లో 95 స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన 24 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని భావిస్తోంది.

14 స్థానాలను టీడీపీ, మిగిలిన 10 స్థానాలను టీజేఎస్, సీపీఐలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే  టీజేఎస్ మాత్రం తమకు 11 స్థానాలను కావాలని కోరుతోంది. సీపీఐ కనీసం నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలను కోరుతోంది.

కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కు ఇచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్, ఆసిఫాబాద్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై టీజేఎస్ కొంత అసంతృప్తితో ఉంది.

మరో వైపు సీపీఐకు మూడు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. కానీ, నాలుగు ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది.

అయితే బుధవారం నాటికి కాంగ్రెస్ పార్టీ నుండి మరో ప్రతిపాదన సీపీఐ నేతలకు వచ్చింది. సీపీఐకు మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ ప్రతిపాదించింది. బెల్లంపల్లి, ఆసిఫాబాద్. వైరా అసెంబ్లీ స్థానాలను కేటాయించనున్నట్టు కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది.

అయితే కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. కానీ కొత్తగూడెం సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రం సుముఖంగా లేదు. ఇదిలా ఉంటే బుధవారం నాడు  సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ కు టీజేఎస్ చీఫ్ కోదండరామ్ వెళ్లారు. సీపీఐ నేతలతో కోదండరామ్ చర్చించారు.

సీపీఐ నేతల ఆలోచన ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకొనేందుకు సీపీఐ కార్యాలయానికి వెళ్లినట్టు కోదండరామ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలో ఉన్నందున వారితో మాట్లాడే అవకాశం దక్కలేదని కోదండరామ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

 

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios