మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయమై ఇంకా తేలలేదు. తాము కోరినన్ని సీట్లు ఇవ్వాలని టీజేఎస్ పట్టుబడుతోంది

grand alliance: TJS demands 16 assembly seats

హైదరాబాద్: మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయమై ఇంకా తేలలేదు. తాము కోరినన్ని సీట్లు ఇవ్వాలని టీజేఎస్ పట్టుబడుతోంది. 9 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది. సీట్ల సర్ధుబాటు కోసం  కాంగ్రెస్ పార్టీకి మరో రెండు రోజుల సమయాన్ని టీజేఎస్ కల్పించింది. రెండు రోజులలోపుగా పొత్తులపై తేల్చకపోతే టీజేఎస్ ఏం చేయనుందోననేది ఆసక్తిగా మారింది.

24 గంటల్లోపుగా పొత్తులపై తేల్చాలని టీజేఎస్  చీఫ్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటమ్ జారీ చేశారు.  అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరుసీనియర్లు,  టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ కోదండరామ్‌తో చర్చించారు.  దీంతో   మరో రెండు రోజుల గడువును కాంగ్రెస్ పార్టీకి  కోదండరామ్ ఇచ్చారు.

తమకు కనీసం 16 సీట్లు కావాలని కోదండరామ్ కోరుతున్నారు.  కానీ, కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు  కేవలం 9 సీట్లు ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది. కానీ 16 సీట్లు ఇవ్వాలని  టీజేఎస్ పట్టుబడుతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే మహాకూటమితో పొత్తు, సీట్ల సర్ధుబాటు తదితర విషయాలను చర్చించేందుకు గాను  టీజేఎస్ రాష్ట్ర కమిటీ అక్టోబర్ 12 వ తేదీన సమావేశం కానుంది.ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ఫైనల్ చేయనున్నారు. 

మరో వైపు పొత్తులను సీట్ల కోణంలో చూడొద్దని కోదండరామ్ అభిప్రాయపడుతున్నారు. మహాకూటమిలోని పార్టీల సమావేశం టీ తాగేందుకు మాత్రమే పరిమితమౌతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.పొత్తుల విషయాన్ని  సాగతీయడం వల్ల రాజకీయంగా ప్రయోజనం కంటే నష్టమేనని  టీజేఎస్ అభిప్రాయపడుతోంది.

ఈ పరిణామాలన్నింటిని   టీజేఎస్ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించనున్నారు. మరోవైపు మహాకూటమి కామన్ మినిమ్ ప్రోగ్రాంను ఫైనల్ చేసి  ప్రజల్లో చర్చకు పెట్టాల్సిన అవసరాన్ని కూడ కోదండరామ్ గుర్తుచేస్తున్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాం గురించి  ఫైనల్ చేయకపోతే  నష్టమని ఆయన అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే  రెండు రోజుల్లోపుగా  సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టత రాకపోతే టీజేఎస్  ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

సంబంధిత వార్తలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios