మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమి పేరు మారనుంది. ఇక నుండి మహా కూటమికి బదులుగా తెలంగాణ పరిరక్షణ వేదికగా పిలువనున్నారు. ఈ మేరకు మహాకూటమిలోని పార్టీ నేతల మధ్య ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
హైదరాబాద్: మహాకూటమి పేరు మారనుంది. ఇక నుండి మహా కూటమికి బదులుగా తెలంగాణ పరిరక్షణ వేదికగా పిలువనున్నారు. ఈ మేరకు మహాకూటమిలోని పార్టీ నేతల మధ్య ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
మహాకూటమిలో ప్రస్తుతం టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు భాగస్వామిగా ఉన్నాయి. బుధవారం నాడు ఈ నాలుగు పార్టీలకు చెందిన నేతలు హైద్రాబాద్ గోల్కోండ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై చర్చిస్తున్నారు.
తమ కూటమిలోని పార్టీలకు ఓటు చేస్తే ఏం చేస్తామనే విషయమై ఈ పార్టీలు చర్చిస్తున్నాయి. ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాయి. తమ కూటమికి ఓటేస్తే చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో వివరించనున్నారు.
కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కు ప్రోఫెసర్ కోదండరామ్ ఛైర్మెన్ గా ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.అయితే మహా కూటమి కంటే ఈ పార్టీల ఉమ్మడి వేదికను తెలంగాణ పరిరక్షణ వేదికగా పేరు మార్చాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. వారం రోజుల వ్యవధిలో మహాకూటమి నేతలు వరుసగా నాలుగుసార్లు భేటీ అయ్యారు.
సంబంధిత వార్తలు
జూబ్లీహిల్స్: పొత్తుతో విష్ణు చిత్తవుతారా?
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?