Asianet News TeluguAsianet News Telugu

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

ప్రజా కూటమి (మహా కూటమి)లో  సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ తీరుపై  టీజేఎస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది

congress ready to give 11 assembly seats to tjs
Author
Hyderabad, First Published Nov 6, 2018, 5:22 PM IST


హైదరాబాద్: ప్రజా కూటమి (మహా కూటమి)లో  సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ తీరుపై  టీజేఎస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.  సీట్ల సర్దుబాటు పూర్తి చేసినట్టుగానే చేస్తూ కాంగ్రెస్ పార్టీ మెలిక పెట్టిందని టీజేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్  రెడ్డి టీజేఎస్‌కు కేటాయించే 11 సీట్ల జాబితాను  టీజేఎస్‌ చీఫ్ కోదండరామ్‌కు అందించారు. అయితే ఈ 11 సీట్లలో 9 సీట్లలో టీజేఎస్‌ పోటీకి  కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. మరో 2 సీట్లలో టీజేఎస్‌పై కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తామని మెలిక పెట్టింది.

దీంతో కాంగ్రెస్ పార్టీ తీరుపై టీజేఎస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమైన కోదండరామ్ సీట్ల సర్దుబాటు విషయమై  చర్చించారు.ఈ సమావేశంలోనే టీజేఎస్ పోటీ చేసే స్థానాల జాబితాను  ఉత్తమ్ కుమార్ రెడ్డి అందించారు.

ఆసిఫాబాద్, రామగుండం,స్టేషన్‌ఘన్‌పూర్, దుబ్బాక, మెదక్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, మహాబూబ్‌నగర్, నిజామాబాద్ అర్బన్, మిర్యాలగూడ,మహాబూబాబాద్ స్థానాలను టీజేఎస్ కు ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

అయితే  కాంగ్రెస్ ఇచ్చిన జాబితాలో  నల్గొండ, మహాబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో టీజేఎస్‌కు సీట్లు లేవు. దీనిపై టీజేఎస్‌ నేతలు తమ అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెప్పారు.

స్టేషన్‌ఘన్‌పూర్, ఆసిఫాబాద్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీ విషయమై కూడ స్పష్టత ఇవ్వాలని కూడ కాంగ్రెస్ పార్టీని టీజేఎస్ కోరింది. మరో వైపు సామాజిక వర్గాల సమతుల్యతను కూడ టీజేఎస్ కోరుకొంటుంది. ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లలో అన్ని సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించే పరిస్థితి లేదని టీజేఎస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

ఈ విషయమై తమ అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి టీజేఎస్ నేతలు చెప్పాలని భావిస్తున్నారు. కాంగ్రెస్  పార్టీ నిర్ణయం ఆధారంగా  టీజేఎస్ భవిష్యత్ కార్యాచరణను ఫైనల్ చేయనున్నారు.


సంబంధిత వార్తలు

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios