విశాఖపట్టణం: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన  శ్రీనివాస్‌కు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని సిట్ భావిస్తోంది. ఈ మేరకు ఈ పరీక్షల కోసం  రంగం సిద్దం చేసుకొంటుంది. ఇదిలా ఉంటే  ఎయిర్‌పోర్ట్‌లో  సెక్యూరిటీ లోపానికి  బాధ్యుడిగా చేస్తూ  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ ను ఆదివారం నాడు చెన్నైకు బదిలీ చేశారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అక్టోబర్ 25వ తేదీన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో  వారం రోజుల పాటు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకొని సిట్ విచారించింది. నవంబర్ రెండో తేదీన పోలీసు కస్టడీ ముగియడంతో  జ్యూడీషీయల్ కస్టడీకి తరలించారు.

ఇదిలా ఉంటే  నవంబర్ 5వ తేదీన శ్రీనివాసరావుకు బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. వారం రోజుల పాటు  పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాసరావు  నుండి సరైన  సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ తరుణంలో శ్రీనివాసరావుకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని సిట్ భావిస్తోంది.

పాలీగ్రాఫ్ పరీక్షల కోసం సిట్ కోర్టులో  పిటిషన్ దాఖలు చేయనుంది. మరో వైపు  మరికొన్ని రోజుల  కస్టడీ కోసం కూడ పోలీసులు సోమవారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

ఇదిలా ఉంటే  ముమ్మిడివరంలో శ్రీనివాసరావుపై  గతంలో కొందరిని బెదిరించిన కేసు కూడ నమోదై ఉంది. ఈ కేసు ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాసరావుకు ఎలా ఉద్యోగం కల్పించారనే విషయమై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్‌లో  శ్రీనివాసరావుకు ఉద్యోగం కల్పించే సమయంలో  ఎయిర్‌పోర్ట్ పీఎస్  పరిధిలో శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులు లేవని  అధికారులు ఎన్ఓసీ ఇచ్చారు. కానీ, శ్రీనివాసరావు పేరున  అతని స్వగ్రామంలో ఉన్న కేసును గురించి పోలీసులు పట్టించుకోలేదు. విశాఖ ఎయిర్‌పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద సరైన చెకింగ్ లేదనే విమర్శలు కూడ లేకపోలేదు.

ప్రధాన ద్వారం వద్ద ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లే వారి ఐడీ ఫ్రూప్, టిక్కెట్టు వివరాలను సరిచూసుకొని  లోనికి అనుమతిస్తారు. కానీ, వారు తమ వెంట ఏం తీసుకెళ్తున్నారనే విషయాన్ని పోలీసులు పెద్దగా చెక్ చేయరు.  విమానం ఎక్కేందుకు లోనికి వెళ్లే సమయంలో మాత్రం ప్రయాణీకుడి వెంట ఉన్న లగేజీని కూడ తనిఖీ చేస్తారు.

రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాసరావు తాను పనిచేసే రెస్టారెంట్ లో కిచెన్ లో పనిచేసేవాడు.  అయితే ఆహారపదార్ధాలను అందంగా కట్ చేసేందుకు ఈ కత్తులు ఉపయోగపడుతాయనే ఉద్దేశ్యంతో రెస్టారెంట్ కు తీసుకొచ్చినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం.

ప్రధాన ద్వారం వద్ద కూడ పెద్దగా చెకింగ్ ఉండదు.  రెస్టారెంట్ లో పనిచేస్తున్నట్టుగా శ్రీనివాస్ వద్ద ఆధారాలున్నాయి.ఈ ఆధారాలతో శ్రీనివాసరావు సులభంగానే  కత్తులు ఉన్నా నేరుగా రెస్టారెంట్‌లోకి వెళ్లినట్టుగా పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు. 

ఈ కారణంగానే శ్రీనివాసరావు తాను పనిచేసే రెస్టారెంట్‌లోకి కత్తిని తీసుకెళ్లినట్టు సిట్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.  అయితే  శ్రీనివాసరావు పనిచేసిన రెస్టారెంట్‌ను పోలీసులు సీజ్ చేశారు. శ్రీనివాసరావుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడ పోలీసులు విచారించారు.

సంబంధిత వార్తలు

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో