అమరావతి: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌‌పై  ఆయన  అభిమాని దాడి చేస్తే  రాష్ట్ర ప్రభుత్వానికి  ముడిపెట్టడం సమంజసం కాదని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు.

నీరు -ప్రగతిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు  టెలికాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్‌లో  జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ప్రత్యర్థుల కట్టడికి వ్యవస్థలను వాడుకోవడం సరైందికాదన్నారు.  టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా  ఉన్నంత కాలం ఎందుకు  ఐటీ దాడులు జరగలేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐలోని ఉన్నతాధికారుల మధ్య  చోటు చేసుకొన్న పరిణామాలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని చెప్పారు.

మనం చేసే పని సక్రమమైతే ఎవరికీ కూడ భయపడాల్సిన అవసరం లేదన్నారు.మంచి జరుగుతుందనే ఎన్డీఏలో చేరామని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సరిగా స్పందించలేదన్నారు. ఈ కారణంగానే  ఎన్డీఏ నుండి బయటకు వచ్చామన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

 ప్రత్యర్ధులను కట్టడి చేయడానికి వ్యవస్థలను వాడుకోవడం సరికాదని  పరోక్షంగా కేంద్రంపై  చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. కేంద్రం సహకరించకపోయినా విపక్షాల కుట్రలు, అడ్డంకులను  అధిగమిస్తూ  ముందుకు సాగుతున్నట్టు  చెప్పారు. వినూత్న ఆలోచనలతో   సత్ఫలితాలు పొందుతున్నామని, ఇందుకు  నీరు-ప్రగతి కార్యక్రమమే నిదర్శనంగా ఆయన అభిప్రాయపడ్డారు.

స్వయంకృషితో అభివృద్ధి ఆగకుండా చూసినట్టు  చంద్రబాబునాయుడు చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా  30 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. ఖరీఫ్‌లో 91 శాతం సేద్యం జరిగిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.  రబీ సీజన్‌లో కూడ  ముమ్మరంగానే వ్యవసాయ పనులు సాగుతున్నాయని ఆయన  చెప్పారు.

రైతుల అవసరాలకు తగ్గట్టుగానే  ఇన్‌పుట్స్‌ను అందుబాటులో ఉంచాలని  చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రబీలో విత్తనాలు, ఎరువులు, పంట రుణాల కొరత లేకుండా చూడాలని చంద్రబాబునాయుడు సూచించారు.

జల సంరక్షణ చర్యలను చేపట్టాలని చంద్రబాబునాయుడు అధికారులను కోరారు. త్వరలోనే  మరో 2 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలను నిర్వహించనున్నట్టు బాబు  ప్రకటించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  చంద్రబాబునాయుడు సూచించారు. 

కర్నూల్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు అధికంగా నమోదౌతున్నాయని  చెప్పారు.  పొరుగు రాష్ట్రాల నుండే ఈ వ్యాధి ఎక్కువగా  ప్రబలుతోందని చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు.సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ