వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడికి పాల్పడిన శ్రీనివాసరావుకు పోలీసులు లైడిటెక్టర్ పరీక్ష జరిపే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా వారం రోజుల నుంచి శ్రీనివాసరావును విచారించిన సిట్ కొన్ని కీలక ఆధారాలను సంపాదించింది.

అయితే ఇవాళ్టీతో అతని కస్టడీ గడువు పూర్తవుతుండటంతో శ్రీనివాస్‌ను విశాఖ సెంట్రల్ జైలుకు అప్పగించాల్సి వుంది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడి కస్టడీని పొడిగించాలని సిట్ అధికారులు.. కోర్టును కోరే అవకాశం ఉంది. ఈ కేసులోని కీలక ఆధారాలను బయట పెట్టలేమని సిట్ చెబుతోంది.

దాడికి వాడిన కోడి కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. ఆ రిపోర్డు అందాల్సి వుందని తెలిపారు. శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా లేదని తొలుత భావించామని.. అయితే వైద్యుల పరీక్షల తర్వాత అతను బాగున్నాడనే నిర్ణయానికి వచ్చామని సిట్ డీఎస్పీ అస్మి తెలిపారు. మరోవైపు జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుతో పాటు మరికొందరిని ఇవాళ సిట్ ప్రశ్నించనుంది. 

More News:

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు