హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చేపట్టిన పాదయాత్ర కు వారం రోజులపాటు విరామం ప్రకటించారు. గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన నేపథ్యంలో ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్సపొందుతున్నారు. 

శ్రీనివాస్ దాడిలో భుజానికి గాయమైన కారణంగా వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో జగన్ నవంబర్ 2 వరకు పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. తిరిగి నవంబర్ 3 నుంచి విజయనగరం జిల్లాలో యథావిథిగా పాదయాత్ర కొనసాగుతుందని తలశిల రఘురామ్ ప్రకటించారు.