రాష్ట్ర విభజన హామీల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న ధర్మపోరాట దీక్షలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరు వెళ్తున్నారు.

ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడి జరగడం.. ఇది సీఎం కనుసన్నుల్లో జరగిందని.. అలాగే ప్రతిపక్షనేతపై దాడిపై చంద్రబాబు స్పందన సరిగా లేదంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో జగన్ సొంత జిల్లాలో ముఖ్యమంత్రి అడుగుపెడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు భద్రతను పెంచాలని.. ఆయన పర్యటించే మార్గాల్లో తనిఖీలు చేపట్టాలని ఇంటెలిజెన్స్ కడప జిల్లా పోలీస్ యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. సీఎం మధ్యాహ్నం 12.45 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 1.35 గంటలకు హెలికాఫ్టర్‌లో ప్రొద్దుటూరుకు వెళతారు. తొలుత గండికోట ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించి సభకు వెళతారు. 

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

ఏపీలో రక్తికట్టని కోడికత్తి నాటకం, ఢిల్లీలో డ్రామా: కాల్వ

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

నాకు బూతుల్లో పీహెచ్‌డీ ఉంది.. జాగ్రత్త: రోజాకు శివాజీ వార్నింగ్