హైదరాబాద్: ఆపరేషన్ గరుడ సూత్రధారి హీరో శివాజీ అమెరికా పారిపోయాడని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఆయన మరోసారి తెర మీదికి వచ్చారు. తాను చెప్పినట్లే జరుగుతోందని ఆయన ప్రకటించుకున్నారు. 

జగన్మోహన్ రెడ్డిపై దాడిని ప్రస్తావిస్తూ హీరో శివాజీ చెప్పినట్లే జరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముందు తాను నమ్మలేదు గానీ జగన్ పై దాడి వ్యవహారాన్ని చూస్తుంటే అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. 

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, పి. గౌతం రెడ్డి తదితరులు శివాజీపై విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. శివాజీని అరెస్టు చేసి, విచారించాలని వారు డిమాండ్ చేశారు. 

జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం సమాచారాన్ని శివాజీకి ఎవరు అందించారో వెల్లడించాలని బిజెపి నాయకులు కన్నా లక్ష్మినారాయణ, జివీఎల్ నరసింహారావు కూడా డిమాండ్ చేస్తున్నారు.

చంద్రబాబు, శివాజీ కలిసి ఆపరేషన్ గరుడ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నించారని వైసిపి ఎమ్మెల్యే రోజా మంగళవారంనాడు ఆరోపించారు. ఈ కేసులో దొరక్కుండా ఉండేందుకు ప్లాన్ లో భాగంగానే శివాజీ అమెరికా పారిపోయాడని ఆమె వ్యాఖ్యానించారు. 

అయితే, తాను పారిపోలేదని శివాజీ అంటున్నారు. ఈ మేరకు ఆయన అమెరికా నుంచి ఓ వీడియో విడుదల చేశారు. తాను కొత్తగా అమెరికా వెళ్లలేదని, 54 సార్లు అమెరికా వచ్చి వెళ్లానని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

మేం ఒంటరికాదు...పవన్ మాతోనే: సీపీఎం మధు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్ కి షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్..?

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట