అమరావతి: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో జగన్నాటకం అంటూ ఘాటుగా విమర్శిస్తున్న లోకేష్    
ఢిల్లీలో రాసిన కథ, విశాఖ ఎయిర్ పోర్ట్ లో రక్తి కట్టిందంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఢిల్లీ నుండి ఇతర రాష్ట్రాల నేతల వరకూ విశ్వ ప్రయత్నాలు చేసారని ట్వీట్ చేశారు.

అరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కిరాతకంగా చంపిన  ఘటన, కొండ గట్టు బస్సు ప్రమాదం, తిత్లీ తుఫాను సమయంలో కనీసం సానుభూతి తెలపని నాయకులు స్పందించి నలుగురికి సహాయం చెయ్యని వారు కోడి కత్తి వార్త కూయక ముందే ఢిల్లీ నుండి గల్లీ వరకూ ప్రీ ప్లాన్డ్ ప్రెస్ మీట్లు పెట్టారంటూ ట్వీట్ చేశారు. 

కుట్ర రాజకీయం అనడానికి ఈ ఆధారాలు సరిపోవా? అంటూ మరో ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్లకు #jagannatakam అనే హ్యాష్‌ ట్యాగ్‌తో విమర్శలు గుప్పిస్తున్నారు.