వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి వెనుక టీడీపీ కుట్ర దాగుందని ఆమె ఆరోపించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కోటీ రూపాయలతో ల్యాండ్ కొనుగోలు చేసేందుకు బేరాలు మాట్లాడాడని ఆమె ఆరోపించారు..

దీనికి సంబంధించి టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని.. వారు వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హీరో శివాజీ పథకం ప్రకారమే అమెరికాకు పారిపోయాడని రోజా ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రవర్తన చూస్తుంటే తనకు వెగటు వేస్తోందన్నారు..

ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్న నేతలు దాడికి గురైన వారిని గురించి వెటకారంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్షనేతపై దాడి జరిగిన గంటలోనే నిందితుడు జగన్ వీరాభిమాని అని డీజీపీ చెప్పడం.. క్షణాల్లో ఫ్లెక్సీని విడుదల చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు రోజా అనుమానం వ్యక్తం చేశారు.

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

ఏపీలో రక్తికట్టని కోడికత్తి నాటకం, ఢిల్లీలో డ్రామా: కాల్వ

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట