అమరావతి: వారం రోజుల పాటు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ప్రజా సంకల్ప యాత్రకు  బ్రేక్ పడనుంది.  జగన్‌‌పై దాడి జరిగినందుకు యాత్రకు విరామం  ఇవ్వాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం నాడు వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు.విశాఖ నుండి నేరుగా హైద్రాబాద్‌కు వచ్చిన జగన్  సిటి న్యూరో సెటర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నాడు. శుక్రవారం నాడు ఉదయం మధ్యాహ్నాం ఆసుపత్రి నుండి  జగన్ డిశ్చార్జి అయ్యారు.

జగన్‌ను కనీసం ఐదు రోజుల పాటు  విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.  వైద్యుల సూచనతో  జగన్ పాదయాత్రకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు  నెలకొన్నాయి. 

గురువారం నాడు ఉదయం పూట పదిన్నర వరకు పాదయాత్రను పూర్తి చేసి  హైద్రాబాద్‌కు చేరుకోవడం జగన్ షెడ్యూల్. ఇందులో భాగంగానే విశాఖ నుండి హైద్రాబాద్‌కు వస్తున్న సమయంలో ఆయనపై దాడి  జరిగింది.  

ప్రతి శుక్రవారం నాడు  కోర్టు కేసుకు హాజరుకావాల్సి ఉన్నందున జగన్ శుక్రవారం నాడు పాదయాత్రకు దూరంగా ఉంటున్నారు.. కోర్టు వాయిదా పూర్తి చేసుకొని శనివారం నాడు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

అయితే  గురువారం నాడు వైజాగ్ లో దాడి జరగడంతో జగన్ భుజానికి గాయమైంది. దీంతో  జగన్‌ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నందున వారం రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్  పడనుంది. వారం రోజుల పాటు యాత్రకు దూరంగా జగన్ ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తిరిగి జగన్ ఎప్పుడు పాదయాత్రలో పాల్గొంటారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ