విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస రావు అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతన్ని పోలీసులు విశాఖపట్నంలోని కెజీహెచ్ కు తరలించారు. శ్రీనివాస్ గుండె నొప్పితో బాధపడుతున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో అతన్ని విశాఖ విమానాశ్రయం పోలీసు స్టేషన్ లో డాక్టర్ దేముడు బాబు పరీక్షించారు.

చికిత్స నిమిత్తం కెజిహెచ్ కు తరలించాలని ఆయన సూచించారు తనకు చికిత్స వద్దని, తన అవయవాలను దానం చేస్తానని తన శ్రీనివాస్ మొర పెట్టుకున్నట్లు దేముడుబాబు చెప్పారు. దాంతో అతన్ని సిట్ అధికారులు కెజీహెచ్ కు తరలించారు.

కెజీహెచ్ లో శ్రీనివాస్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తనకు ప్రాణ హాని ఉందని, తాను రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలని శ్రీనివాస్ అన్నట్లు చెబుతున్నారు. 

మీడియాతో మాట్లాడనీయకుండా పోలీసులు శ్రీనివాస్ తీసుకుని వెళ్లారు. ప్రజల మంచికోసమే తాను జగన్ పై దాడి చేశానని అన్నాడు. తన ప్రాణహాని ఉందంటూ అతను అరిచాడు. తాను మరణిస్తే తన అవయవాలు దానం చేయాలని అన్నాడు.

రెండు రోజులు శ్రీనివాస్ సరిగా ఆహారం తీసుకోవడం లేదని, తినడానికి ఏది కావాలన్నా ఇస్తన్నామని పోలీసు అధికారి మల్లు శేషు చెప్పారు. సాధారణ చెకప్ కోసం శ్రీనివాస్ ను కెజీహెచ్ కు తీసుకుని వచ్చినట్లు తెలిపారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత సిఐఎస్ఎఫ్ శ్రీనివాస రావును అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించింది. ఆ తర్వాత శ్రీనివాస రావును పోలీసులు విచారించి, వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. 

అనంతరం విచారణ నిమిత్తం శ్రీనివాస రావును పోలీసులు ఆదివారంనాడు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గత మూడు రోజులుగా శ్రీనివాస రావును విచారిస్తున్నారు. 

జగన్ పై దాడి వ్యవహారం రాజకీయ రంగును పులుముకుంది. శ్రీనివాస రావు ఏ పార్టీ కార్యకర్త అనే విషయంపై కూడా దుమారం చెలరేగుతోంది. 

సంబంధిత వార్తలు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)