Asianet News Telugu

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడికి సంబంధించిన విచారణ వేగంగా జరుగుతోంది

SIT send notices to 15 YSRCP Leaders
Author
Visakhapatnam, First Published Oct 30, 2018, 8:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడికి సంబంధించిన విచారణ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్‌పోర్టులో దాడి జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్‌ని నిశీతంగా గమనిస్తున్న విచారణ బృందం.. ఆ సమయంలో జగన్ సమక్షంలో ఉన్న 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు పంపింది..

తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.  రాజన్నదొర, కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయ్‌కుమార్‌, కేకే రాజు, సుధాకర్‌, చిన్నశ్రీను, కొండా రాజీవ్‌, వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణకాంత్‌ సహా 15 మందికి సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద నోటీసులు అందజేశారు.

దీనిపై ఇప్పటి వరకు పార్టీ నేతలు స్పందించలేదని సిట్ అధికారులు తెలిపారు. కృష్ణకాంత్ ఒక్కరే పోలీసుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు శ్రీనివాసరావును ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో విశాఖ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా, సిట్ అధికారులు ప్రశ్నించారు.

జాతీయ స్థాయిలో చర్చ జరగాలనే తాను దాడికి పాల్పడినట్లు అతను మరోసారి చెప్పాడు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ఆరా తీసేందుకు గాను.. అతనికి ఉన్న మూడు బ్యాంకు ఖాతాలను సిట్ పరిశీలించింది. వీటిలో ఎస్‌బీఐలో మూడు నెలల క్రితం రూ.70 వేల లావాదేవీలు జరగ్గా... ప్రస్తుతం రూ.320 మాత్రమే నగదు ఉన్నట్లు తేలింది.

అలాగే ఆంధ్రాబ్యాంకులో రూ.45 నిల్వ ఉంది. అమలాపురం విజయా బ్యాంకులో కేవలం ఖాతా తెరిచినప్పుడు వేసిన రూ.1000 మాత్రమే ఉంది. మొత్తంగా మూడు ఖాతాల్లో ఉన్నది రూ.1365 మాత్రమే. అయితే శ్రీనివాసరావు ఎస్‌బీఐ ఖాతాలో విశాఖలో పనిచేస్తున్న రెస్టారెంట్ యాజమాన్యం రూ. 40 వేలు డిపాజిట్ చేసింది.

ఇది జగన్‌పై దాడి జరగకముందు.. ఆ మొత్తాన్ని అతడు అదే రోజు డ్రా చేసినట్లు తెలిసింది. శ్రీనివాసరావు కాల్ డేటా ఆధారంగా అతడు ఎక్కువగా ఎవరితో మాట్లాడాడు.. ఏం మాట్లాడాడు.. దాడికి ముందు ఎవరితోనైనా మాట్లాడాడా వంటి వివరాలను సిట్ ఆరా తీస్తోంది.

ఎక్కువగా అమ్మాయిలతోనూ... రెస్టారెంట్‌లో పనిచేసే కొందరు మహిళా సిబ్బందితో శ్రీనివాసరావు అతిగా మాట్లాడినట్లు గుర్తించి.. వారిని స్టేషన్‌కు పిలిపించారు. గృహనిర్మాణ పథకం ద్వారా రుణాలు మంజూరయ్యారన్న విషయంపై సమగ్ర విచారణ చేపట్టారు.

ముమ్మడివరంలోని గృహనిర్మాణ కార్యాలయంలో చేపట్టిన దర్యాప్తులో 2016-17లో శ్రీనివాసరావు తండ్రి తాతారావు పేరున, సోదరుడు సుబ్బరాజు పేరున ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం కింద రెండు ఇళ్లు మంజూరైనట్లుగా తెలిసింది. ముమ్మడివరం ఆంధ్రాబ్యాంకు ఖాతాలో ఆరు నెలల క్రితం కొత్తపేటకు చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రూ. లక్ష బదిలీ చేసినట్లు సమాచారం.

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

ఏపీలో రక్తికట్టని కోడికత్తి నాటకం, ఢిల్లీలో డ్రామా: కాల్వ

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు
 

Follow Us:
Download App:
  • android
  • ios