జగన్‌పై దాడి అనంతరం తలెత్తిన పరిణామాలతో పాటు రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లు, ఎస్పీలతో అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్‌పై డీజీపీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డీజీపీ ఇబ్బంది పడ్డారు.. గోదావరి జిల్లాల్లో ఆందోళనలు, అల్లర్లు ఎందుకు పెరిగాయన్న చంద్రబాబు... సరైన సమాచారం లేకుండానే నేరాలపై నివేదిక ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీజీపీ ఇచ్చిన రిపోర్టు సరిగా లేదని.. రాజకీయ ఆందోళనలు, రౌడీయిజంపై దృష్టి పెట్టాలని సూచించారు. పొలిటికల్ నేరాలను అరికట్టే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. నేరాలను అరికట్టే విషయంలో పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగానే ఉందన్నారు.

అయితే పొలిటికల్ క్రైమ్ అరికట్టే విషయంలో పరిస్థితి మెరుగవ్వాలన్నారు.. రాబోయేది ఎన్నికల సమయం కాబట్టి... వచ్చే ఆరు నెలల్లో రాజకీయ నేరాలకు ఎక్కువ అవకాశం ఉందని అందువల్ల పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ