Asianet News TeluguAsianet News Telugu

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని విశాఖపట్నం సీపీ లడ్డా స్పష్టం చేశారు. నిందితుడు తమ కస్టడీలో ఉన్నాడని అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు అని స్పష్టం చేశారు. ప్రాణహాని ఉందని శ్రీనివాస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

visakha cp ladda comments on srinivas condition
Author
Visakhapatnam, First Published Oct 30, 2018, 8:16 PM IST

 

విశాఖపట్నం: వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని విశాఖపట్నం సీపీ లడ్డా స్పష్టం చేశారు. నిందితుడు తమ కస్టడీలో ఉన్నాడని అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు అని స్పష్టం చేశారు. 

ప్రాణహాని ఉందని శ్రీనివాస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అతను తమ ఆధీనంలో బాగానే ఉన్నట్లు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, తనను రాజకీయంగా వాడుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. 

తనను విచారించొద్దు తన అవయవాలు దానం చేసుకోండని శ్రీనివాస్ వైద్యులతో అన్న వార్తలపై స్పందించిన సీపీ శ్రీనివాస్ పదకొండు పేజీల లేఖలో ఆఖరిపేజీలో ముందే రాసుకున్నాడని తనకు ఏమైనా అయితే తన అవయవాలను దానం చెయ్యండని రాసినట్లు గుర్తు చేశారు.

తమకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.  శ్రీనివాస్ ను రెగ్యులర్ మెడికల్ చెకప్ లో భాగంగానే తీసుకువచ్చినట్లు తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వల్లే వైద్యులు తిరిగి తమ కస్టడీకి అప్పగించారని తెలిపారు.  

దాడి కేసులో వివిధకోణాల్లో విచారణ చేస్తున్నట్లు విశాఖ సీపీ లడ్డా తెలిపారు. శ్రీనివాస్ విచారణకు పూర్తిగా సహకరించడం లేదని కొన్ని విషయాలు దాస్తున్నారని చెప్పారు.  ఇప్పటి వరకు 35 మంది సాక్షులను విచారించినట్లు తెలిపారు. ముఖ్యంగావ నిందితుడు ఫోన్ డేటా, ఆర్థిక లావాదేవీలపై ఆరాతీస్తున్నట్లు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ 9 సెల్ ఫోన్లు వినియోగించినట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ లడ్డా తెలిపారు. 

ఇప్పటి వరకు అతను ఉపయోగించిన 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన రెండు సెల్ ఫోన్లపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఒక ఫోన్ యానంలో పోగొట్టుకున్నట్లు చెప్పాడని మరో సెల్ ఫోన్ వేరేవాళ్ల దగ్గర ఉందని చెప్తున్నారని అయితే అతను చెప్పిన పేర్లు దగ్గర ఫోన్ లేదని తెలిపారు. 

మరోవైపు శ్రీనివాస్ బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ కు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ముమ్ముడివరంలో ఎస్.బీఐ, ఆంధ్రాబ్యాంకు ఖాతాలు ఉన్నాయని అలాగే అమలాపురంలో విజయాబ్యాంక్ కూడా ఉందని తెలిపారు. 

అలాగే శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సెక్షన్స్ అయిన 20వేలు, 40వేలు నగదుపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. అయితే రూ.40వేలు నగదు తోటి ఉద్యోగి రమాదేవి తన బ్రదర్ అకౌంట్ లో వేసేందుకు శ్రీనివాస్ అకౌంట్ ను వాడుకున్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ముమ్మడివరం ఎస్ బీఐలో రూ.55, అమలాపురంలో విజయాబ్యాంక్ లో రూ.355, ముమ్ముడివరం ఆంధ్రాబ్యాంక్ లో నిల్ బ్యాలెన్స్ ఉందని చెప్పారు. 

ఇకపోతే రూ.40వేలు నగదుకు సంబంధించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే శ్రీనివాస్ తొమ్మిది సెల్ ఫోన్లు రెండు సిమ్ లు వాడినట్లు సీపీ లడ్డా తెలిపారు. శ్రీనివాస్ తనతో కలిసి పనిచేసే ఉద్యోగుల ఫోన్లను కూడా ఉపయోగించేవాడని అందువల్ల మధ్యప్రదేశ్, ఒడిస్సాకు ప్రత్యేక బృందాలను పంపినట్లు తెలిపారు. 

ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకు 35 మంది సాక్షులను విచారించినట్లు తెలిపారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురికి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగవా సీఆర్పీ 160 కింద నోటీసులు ఇచ్చామని అయితే ఇద్దరు మాత్రమే సహకరించారని వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వైసీపీకి చెందిన జియ్యాని శ్రీధర్, కృష్ణకాంత్ అలియాస్ కేకేలను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. 

అలాగే రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ను సైతం విచారించామని క్యాంటీన్ లోని వ్యక్తులు ఎలా లోపలికి వస్తారు...కోడి కత్తి ఎలా వచ్చింది అన్న కోణంలో ఆరా తీసినట్లు తెలిపారు. 
 నాకు ఏమైనా జరిగితే అవయవాలు తీసుకోండి అని పిలిచారు. ఇకపోతే జగన్ పై దాడికి ఉపయోగించిన కత్తిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

Follow Us:
Download App:
  • android
  • ios