Asianet News Telugu

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై దాడి కేసులో థర్ట్‌పార్టీ విచారణ కోరుతూ  ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు  హైకోర్టులో  పిటిసన్ దాఖలు చేశారు.

former mp yv subba reddy files petition in highcourt on jagan attack
Author
Amaravathi, First Published Oct 29, 2018, 11:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


హైదరాబాద్: వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై దాడి కేసులో థర్ట్‌పార్టీ విచారణ కోరుతూ  ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు  హైకోర్టులో  పిటిసన్ దాఖలు చేశారు.  ఈ కేసు విషయమై  ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాగూర్ చేసిన వ్యాఖ్యలను  కూడ  వైసీపీ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అక్టోబర్ 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ  దాడి కారణంగా జగన్ భుజంపై గాయమైంది. ఈ దాడి జరిగిన అరగంటకే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ చేసిన  ప్రకటనపై  వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

ప్రచారం కోసమే  వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడని చెప్పడంపై  వైసీపీ నేతలు మండిపడుతున్నారు. హైద్రాబాద్‌‌లోని  ప్రైవేట్ ఆసుపత్రిలో జగన్ చికిత్స పొందుతున్న సమయంలో ఏపీకి చెందిన సిట్ బృందం స్టేట్‌మెంట్ కోసం  వచ్చిన సమయంలో కూడ జగన్‌ వారికి స్టేట్ మెంట్ ఇవ్వలేదు.

ఏపీ పోలీసులపై  నమ్మకం లేకపోవడంతోనే  జగన్ స్టేట్‌మెంట్‌కు నిరాకరించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఘటనపై థర్డ్‌పార్టీ విచారణను  వైసీపీ నేతలు కోరుతున్నారు.

ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తూ  హైకోర్టులో ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం తరపున  అడ్వకేట్ జనరల్‌ కూడ వాదనలను విన్పించే అవకాశం ఉంది.

తనకు అనుకూలంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో జగన్ చేరాడని.. ప్రభుత్వాసుపత్రిలో ఎందుకు చేరలేదని ఏపీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలను హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్  వాదించే అవకాశం లేకపోలేదు.

ఏపీ పోలీసులు కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన పోలీసులతో విచారణ జరిపించినా కూడ తమకు అభ్యంతరం లేదని కూడ వైసీపీ నేతలు  అభిప్రాయంతో ఉన్నారు. 


సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

Follow Us:
Download App:
  • android
  • ios